Somesekhar
సచిన్, కోహ్లీ, రోహిత్ లను కాదని ఓ టీమిండియా ప్లేయర్ కు నేనెప్పుడూ అభిమానినే అంటూ చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. మరి ఏబీడీనే ఫ్యాన్ గా మార్చుకున్న ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
సచిన్, కోహ్లీ, రోహిత్ లను కాదని ఓ టీమిండియా ప్లేయర్ కు నేనెప్పుడూ అభిమానినే అంటూ చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. మరి ఏబీడీనే ఫ్యాన్ గా మార్చుకున్న ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
Somesekhar
ఆఫ్గానిస్తాన్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా సిద్దమైంది. ఇక ఈ సిరీస్ కోసం చాలా కాలంగా టీ20లకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా గాయాలపాలవ్వడంతో.. హిట్ మ్యానే మళ్లీ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఇక పూర్తిగా యువ ఆటగాళ్ల సత్తాను పరిక్షించే ఉద్దేశంతో వారికే జట్టులో చోటు కల్పించింది మేనేజ్ మెంట్. రింకూ సింగ్, తిలక్ వర్మ, ముకేష్ కుమార్ లాంటి టీనేజ్ సంచలనాలకు మరింతగా అవకాశాలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాదని ఓ టీమిండియా ప్లేయర్ కు నేనెప్పుడూ అభిమానినే అంటూ చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. మరి ఏబీడీనే ఫ్యాన్ గా మార్చుకున్న ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
టీమిండియాలో ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ధోని ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు మరికొందరు ఉన్నారు. అయితే వీరందరిని కాదని సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ప్లేయర్ కు ఆటకు నేను ఎప్పటికీ అభిమానినే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో డివిలియర్స్ మాట్లాడుతూ..”నేనెప్పుడూ సంజూ శాంసన్ కు పెద్ద ఫ్యాన్ ను. అతడు అద్భుతమైన ప్లేయర్. సంజూ తిరిగి టీమిండియా టీ20 జట్టులోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శాంసన్ పై ఏబీడీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా.. ఆఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కోసం వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ ను జట్టులోకి ఎంపిక చేశారు. గత కొంతకాలంగా టీమ్ కు దూరంగా ఉంటూ వచ్చిన సంజూ.. అడపాదడపా ఛాన్స్ లు దక్కించుకుంటున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో జట్టులో చోటు మాత్రం నిలుపుకోలేకపోతున్నాడు. మధ్య మధ్యలో మెరుపులు మెరిపిస్తున్నప్పటికీ, జట్టులోకి వస్తున్న యంగ్ ప్లేయర్ల ముందు తేలిపోతున్నాడు. దీంతో సంజూ వైపు సెలెక్టర్లు చూడటం లేదు. ఇక అతడికి లక్కీ ఛాన్స్ కింద ఆఫ్గాన్ టీ20 సిరీస్ రూపంలో మరో అవకాశం ఇచ్చారు. మరి ఈ సిరీస్ లోనైనా శాంసన్ సత్తా చాటి.. టీ20 వరల్డ్ కప్ రేసులో ఉంటాడో? లేడో? చూడాలి. మరి శాంసన్ ను చిరకాల అభిమానిని అన్న ఏబీడీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
AB Devilliers said “I have always been a fan of Sanju Samson – he is a wonderful player. It is great to see Sanju back in the T20 team”. [ABD YT] pic.twitter.com/gWtACiYNnZ
— Johns. (@CricCrazyJohns) January 10, 2024