Former Kerala Captain K Jayaram Passed Away: భారత క్రికెట్‌లో విషాదం.. గుండెపోటుతో మాజీ కెప్టెన్‌ మృతి!

భారత క్రికెట్‌లో విషాదం.. గుండెపోటుతో మాజీ కెప్టెన్‌ మృతి!

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ కెప్టెన్‌ ఒకరు మృతి చెందారు. ఈ వార్త తెలిసి క్రికెట్‌ అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఆ వివరాలు.. కేరళ మాజీ కెప్టెన్‌, కేసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు కే. జయరామన్‌(67) మృతి చెందారు. తిరువనంతపురంలోని తన నివాసంలో శనివారం సాయంత్రం ఆయన మృతి చెందారు. గుండెపోటు కారణంగా జయరామన్‌ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జయరామన్‌ రంజీ జట్టు తరఫున అత్యుత్తమ ఆడగాడిగా రాణించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరీ ముఖ్యంగా 1980లలో కేరళ రంజీ జట్టు తరఫున అత్యత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1986-87 రంజీల సీజన్‌లో జయరామన్‌ వరుసగా నాలుగు సెంచరీలు సాధించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ రంజీ సీజన్‌లో జయరామన్‌ వరుసగా నాలుగు సెంచరీలు చేయడంతో ఆయన భారత సీనియర్‌ జట్టుకు సెలక్ట్‌ అవుతారని అందరూ భావించారు. కానీ దురదృష్టం కొద్ది.. ఆయనకు జట్టులో స్థానం లభించలేదు. జయరామన్‌ తన కెరీర్‌లో కేరళ సీనియర్‌, జూనియర్‌ జట్లకు సారధిగా వ్యవహరించాడు.

తన కెరీర్‌ మొత్తం మీద ఆయన 44 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి.. 5 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలతో మొత్తం 2358 పరుగులు చేశారు. జయరామన్‌ రంజీ ట్రోఫిలో మాత్రమే కాకుండా దులీప్‌ ట్రోఫీలో సౌత్‌ జోన్‌ తరఫున కూడా ఆడారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత చాలా కాలంపాటు కేరళ జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌గా పని చేశారు జయరామన్‌. అంతేకాక అండర్‌-22, అండర్‌-25 జట్లకు కూడా చీఫ్‌ సెలక్టర్‌గా వ్యవహరించారు. ఇక 2010లో బీసీసీఐ మ్యాచ్‌ రిఫరీగా కూడా పని చేశాడు. జయరామ్‌ మృతి పట్ల బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ సంతాపం వ్యక్తం చేశారు.

Show comments