ప్రపంచ కప్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్!

  • Author Soma Sekhar Published - 04:45 PM, Wed - 1 November 23

ప్రపంచ కప్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరిని షాక్ కు గురిచేశాడు స్టార్ ప్లేయర్.

ప్రపంచ కప్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరిని షాక్ కు గురిచేశాడు స్టార్ ప్లేయర్.

  • Author Soma Sekhar Published - 04:45 PM, Wed - 1 November 23

వరల్డ్ కప్ 2023లో కొన్ని టీమ్స్ దూసుకెళ్తుంటే.. మరికొన్ని జట్లు మాత్రం దారుణంగా విఫలం అయ్యి.. ఇంటిదారి పడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో అత్యంత దారుణంగా విఫలం అయిన టీమ్ ఏదంటే? అందరూ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ అనే చెబుతారు. 2019లో వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్.. ఆ స్థాయి ఆటతీరు కాదుకదా.. కనీసం ఆఫ్గానిస్థాన్ స్థాయి ఆటతీరును కూడా ఈ టోర్నీలో చూపించలేకపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగులో నిలిచి పరువుపోగొట్టుకుంది. ఇలాంటి టైమ్ లో ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాకిచ్చాడు స్టార్ బౌలర్. అంతర్జాతీయ క్రికెట్ కు తాను గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి దారుణంగా తయ్యారు అయ్యింది. ఈ మెగాటోర్నీలో 6 మ్యాచ్ లు ఆడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి పరువుపోగొట్టుకుంది. నెదర్లాండ్స్, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్ ల వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ కంటే ముందుండటం గమనార్హం. ఇక వరుస పరాజయాలతో సతమతం అవుతున్న ఇంగ్లాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. వరల్డ్ కప్ మధ్యలోనే ఆ జట్టు స్టార్ బౌలర్ తాను అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అంటూ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించాడు.

ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లే వరల్డ్ కప్ కొనసాగుతుండగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీమ్ ఆడబోయే చివరి మ్యాచే.. నా చిట్టచివరి మ్యాచ్ అంటూ చెప్పుకొచ్చాడు. 33 ఏళ్ల విల్లే ఇంగ్లాండ్ తరఫున 70 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. వన్డేల్లో 94 వికెట్లు, టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అన్ని కోణాల్లో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇంగ్లాండ్ కు ఆడినందుకు చాలా గర్వపడుతున్నానని.. ఇక నుంచి తన సమయాన్ని తల్లిదండ్రులకు, భార్యా పిల్లలకు కేటాయిస్తానని చెప్పుకొచ్చాడు విల్లే.

Show comments