SNP
IND vs PAK, T20 World Cup 2024, Jasprit Bumrah: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత విజయానికి దోహదం చేసిన 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
IND vs PAK, T20 World Cup 2024, Jasprit Bumrah: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత విజయానికి దోహదం చేసిన 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ గంటకు పైగా ఆలస్యంగా స్టార్ట్ అయినా.. పూర్తి మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు రోహిత్ సేన విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసి.. పటిష్టమైన టీమిండియాను కేవలం 119 పరుగులకే ఆలౌట్ చేసిన పాకిస్థాన్.. విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ, భారత్ పదునైన బౌలింగ్ ఎటాక్ ముందు.. 120 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయలేక చేతులెత్తేసింది. ఈ టోర్నీలో పాక్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్ కంటే ముందు యూఎస్‌కే చేతిలో కూడా పాక్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌తో పాటు, పాక్‌పై విజయంతో భారత్ సూపర్ 8కు మరింత చేరువైంది. మరి పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయానికి దోహదం చేసిన ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. రిషభ్ పంత్
ఐర్లాండ్‌తో ఆడిన జట్టుతోనే రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగాడు. తన ఓపెనింగ్ పార్ట్నర్‌గా మళ్లీ కోహ్లీనే ఎంచుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు విఫలం అయ్యారు. తొలి ఓవర్‌లోనే మంచి షాట్‌తో అగ్రెసివ్‌గా కనిపించిన రోహిత్ శర్మ.. ఒక రాంగ్ షాట్‌తో తన వికెట్ సమర్పించుకున్నాడు. 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకంటే ముందు విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన కవర్ డ్రైవ్ కొట్టి మంచి టచ్‌లో కనిపించినా.. ఆ వెంటనే పాయింట్‌లో ఉస్మాన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేవలం 4 పరుగులే చేశాడు. స్టార్ ప్లేయర్లు, ఓపెనర్లు ఇద్దరూ లేకపోయినా.. రిషభ్ పంత్ జట్టును ముందుకు నడిపించాడు. అక్షర్ పటేల్‌తో కలిసి ఒక కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంత్ చేసిన 42 పరుగులు ఎంతో విజయానికి ఎంతో దోహదం చేశాయి. కాగా, ఈ మ్యాచ్‌లో పంత్‌కు చాలా లైఫ్‌లు వచ్చినా.. అతనికే కలిసివచ్చింది.
2. సూపర్ బౌలింగ్
పాకిస్థాన్‌పై టీమిండియా గెలిచిందంటే.. కచ్చితంగా అది బౌలింగ్ బలంతోనే అని చెప్పుకోవాలి. జట్టులోని ప్రతి బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. పాక్‌పై కేవలం 119 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకోగలిగారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, హార్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ చాలా బాగా బౌలింగ్ చేశారు. అర్షదీప్ సింగ్ కాస్త ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయినా.. అతను కూడా పర్వాలేదనిపించాడు. మొత్తంగా ఈ విజయం బౌలర్ల విజయమే.
3. బుమ్రా
టీమిండియా ఈ మ్యాచ్‌ను బౌలింగ్ కారణంగా గెలిచింది అని చెప్పుకున్నాం. అయితే.. అందులోనూ బుమ్రా గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన అనుభవం, తనపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. అద్భుతమైన బౌలింగ్‌లో అల్లాడించాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి.. 3 కీలక వికెట్లు తీసుకున్నాడు. 3.5 ఎకానమీతో పాక్ బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టిపడేశాడు. బుమ్రా చూపిన ఈ అద్భుత ప్రదర్శన టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ అందించింది.
4. రోహిత్ కెప్టెన్సీ
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్‌ను ముందు పంపాలనే ఆలోచన బాగా వర్క్ అవుట్ అయింది. పంత్, అక్షర్ కలిసి.. కొద్ది సేపు వికెట్ల పతనం అడ్డుకుని.. టీమిండియాకు మంచి భాగస్వామ్యం అందించారు. అలాగే బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డ్ సెట్‌లో కూడా రోహిత్ శర్మ తన మార్క్ కెప్టెన్సీ చూపించాడు. ముఖ్యంగా బౌలింగ్ మార్పులు ఈ మ్యాచ్‌ను తీసుకొచ్చి టీమిండియా చేతుల్లో పెట్టాయి.
5. టాస్ ఓడిపోవడం
ఆటతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్ గెలవడానికి టీమిండియాకు హెల్ప్ చేసిన మరో అంశం టాస్ ఓడిపోవడం. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసేందుకు నిర్ణయించాడు. అయితే.. ఈ గ్రౌండ్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడటం, ఛేజింగ్ చేయడం కష్టమని తెలిసినా.. బాబర్ ఆజమ్ ఛేజింగ్ తీసుకోవడం ఇండియాకు బాగా కలిసి వచ్చింది. టీమిండియా కూడా ఛేజింగ్ చేయాల్సి వస్తే.. ఇలానే ఇబ్బంది పడేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి దోహదం చేసిన ఈ ఐదు అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙒𝙄𝙉! 🙌 🙌
Make that 2⃣ in 2⃣! 👌 👌
Simply outstanding from #TeamIndia to seal a superb 6⃣-run win in New York! 👏 👏
Scorecard ▶️ https://t.co/M81mEjp20F#T20WorldCup | #INDvPAK pic.twitter.com/VNoS6QbAei
— BCCI (@BCCI) June 9, 2024