క్వాలిఫైయర్‌-1లో KKRపై SRH ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే!

SRH vs KKR, IPL 2024: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తో జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. మరి ఆ జట్టు ఓటమికి ప్రధానంగా ఓ ఐదు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

SRH vs KKR, IPL 2024: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తో జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. మరి ఆ జట్టు ఓటమికి ప్రధానంగా ఓ ఐదు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి పాలైంది. మంగళవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ వద్ద మరో అవకాశం ఉంది. ఈ రోజు ఆర్సీబీ, ఆర్‌ఆర్‌ మధ్య జరగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో క్వాలిఫైయర్‌-2లో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. ఫైనల్‌ చేరుతుంది. తిరిగి ఫైనల్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఓటమి పాలైంది. మరి ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఓపెనర్ల వైఫల్యం
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బలం ఏంటో అందరికి తెలిసిందే. బ్యాటింగ్‌తోనే ఆ జట్టు విజయాలు సాధించింది. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దారుణంగా విఫలం అయ్యారు. హెడ్‌ డకౌట్‌ కాగా, అభిషేక్‌ శర్మ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. వీరితో పాటు నితీష్‌ రెడ్డి 9, షాబాజ్‌ ఖాన్‌ 0 కూడా ఘోరంగా ఫెయిల్‌ అయ్యారు. ఓపెనర్లు త్వరగా అవుట్‌ కావడం ఎస్‌ఆర్‌హెచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

2. చెత్త బ్యాటింగ్‌
ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లపై ఎంత ఆధారపడుతుందో ఈ మ్యాచ్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. హెడ్‌, అభిషేక్‌ శర్మ అవుట్‌ అయ్యాక.. మరో రెండు వికెట్లు వరుసగా పడ్డాయి. కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్‌. రాహుల్‌ త్రిపాఠి, క్లాసెన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టినా.. క్లాసెన్‌ అవుట్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలిపోయింది. 101కి 4 వికెట్లు కోల్పోయి పటిష్టస్థితిలోనే నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ చెత్త బ్యాటింగ్‌తో 126 పరుగుల వద్ద 9వ వికెట్‌ కోల్పోయింది. చివర్లో కెప్టెన్‌ కమిన్స్‌ 30 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోర్‌ వచ్చింది.

3. బౌలింగ్‌
160 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకునేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కేకేఆర్‌ ఓపెనర్లు గుర్బాజ్‌, సునీల్‌ నరైన్‌లను తక్కువ స్కోర్‌కే అవుట్‌ చేసినా.. అదే పట్టును కొనసాగించలేకపోయారు. బౌలర్లంతా మూకుమ్మడిగా విఫలం అయ్యారు. ప్యాట్‌ కమిన్స్‌, నటరాజన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. మిగతా బౌలర్లంతా 9, 10కి పైగా ఎకానమీతో బౌలింగ్‌ చేశారు. తక్కువ స్కోర్‌ను కాపాడుకోవాలనే తపన మాత్రమ బౌలర్లలో కనిపించలేదు.

4. వరెస్ట్‌ ఫీల్డింగ్‌
సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ అంతంత మాత్రమే అనుకుంటే.. చెత్త ఫీల్డింగ్‌ దానికి తోడైంది. చాలా సులువైన క్యాచ్‌లను నేలపాలు చేశారు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు. కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యార్‌ వెంటవెంటనే ఇచ్చిన రెండు సింపుల్‌ క్యాచ్‌లను అందుకోలేకపోయారు. ఒక సారి క్లాసెన్‌ పట్టిన క్యాచ్‌ను రాహుల్‌ త్రిపాఠి కాలితో తన్ని నేలపాలు చేశాడు. మరోసారి ట్రావిస్‌ హెడ్‌ చాలా సులువైన క్యాచ్‌ను పట్టలేక జారవిరిచాడు. అసలే తక్కువ స్కోర్‌ ఉందంటే.. దానికి తోడు ఈ చెత్త ఫీల్డింగ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ కొంపముంచింది.

5. కమిన్స్‌ తప్పుడు నిర్ణయం
బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా మూడు విభాగాల్లోనూ విఫలమైన ఎస్‌ఆర్‌హెచ్‌.. క్వాలిఫైయర్‌లో ఓడిపోయింది. కానీ, ఈ ఓటమిలో ప్యాట్‌ కమిన్స్‌ తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా కారణం అయ్యాయి. అవేంటంటే.. టీమ్‌లో కేవలం ముగ్గురు ఫారెన్‌ ప్లేయర్లు మాత్రమే ఆడించడం. గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి అద్భుతమైన ప్లేయర్‌ను బెంచ్‌లో కూర్చోబెట్టి కమిన్స్‌ పెద్ద తప్పుచేశాడు. అతను టీమ్‌లో ఉంటే చాలా బెటర్‌గా ఉండేది. టీమ్‌ కాంబినేషన్‌ కూడా సెట్‌ అయ్యేది. అలాగే టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి ఈ ఐదు కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments