Swetha
OTT Best phycho Killer Movie : ఇప్పటివరకు చాలా సైకో కిల్లర్ మూవీస్ చూసి ఉంటారు కానీ.. ఇలాంటి సినిమా మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఇక్కడ భార్య భర్తలిద్దరూ సైకో కిల్లర్స్. అసలు ఈ సినిమా ఏంటి... ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
OTT Best phycho Killer Movie : ఇప్పటివరకు చాలా సైకో కిల్లర్ మూవీస్ చూసి ఉంటారు కానీ.. ఇలాంటి సినిమా మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఇక్కడ భార్య భర్తలిద్దరూ సైకో కిల్లర్స్. అసలు ఈ సినిమా ఏంటి... ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
Swetha
హర్రర్ సినిమాలకంటే కూడా సైకో కిల్లర్ మూవీస్ చూడడానికి.. భయపెడుతూ టెన్షన్ పెడుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో సైకో కిల్లర్ మూవీస్ చూసి ఉంటారు కానీ ఇలాంటి సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. సైకో కిల్లర్ కథలన్నీ కూడా ఒక దానికి ఒకటి పొంతన లేకుండా.. డిఫరెంట్ గా ఉంటాయి. వీటిలో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని ఉండే కథలు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ కథ గురించే. అసలు ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూసారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ డానిష్ ఫ్యామిలీ.. బియోన్ , అతని కుటుంబం వెకేషన్ కోసం అని ఓ స్పాట్ కు వచ్చి ఉంటారు . అయితే బియోన్ చాలా భయస్తుడు. ప్రతి చిన్నదానికి కూడా భయపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి అక్కడ పాట్రిక్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితో మాట్లాడిన కొద్దీ సేపటికే అతను మంచివాడని.. బియోన్ కుటుంబం నమ్ముతుంది. పాట్రిక్ తానొక డాక్టర్ అని చెప్పి అతని ఫ్యామిలీని కూడా వియు ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. అయితే పాట్రిక్ కొడుకు మాత్రం అబ్నార్మల్ గా బెహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక కొద్దీ సమయంలోనే ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య బాగా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. కొద్దీ సేపటి తర్వాత ఆ రెండు ఫ్యామిలీస్ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత పాట్రిక్ .. బియోన్ కు మెయిల్ పంపించి తన ఇంటికి ఆహ్వానిస్తాడు.బియోన్ కూడా దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి.. అతని ఫ్యామిలీ పాట్రిక్ ఇంటికి వెళ్తారు.
ఇక ఇంటికి వచ్చిన గెస్ట్స్ కు పాట్రిక్ నాన్ వెజ్ పెడతాడు. కానీ బియోన్ భార్య నాన్ వెజ్ తినదని పాట్రిక్ కు ముందే తెలుసు. అయినా సరే పాట్రిక్ ఆఫర్ చేయడంతో కాదనలేక తింటుంది. ఇక ఆ తర్వాత వారు ఉండడానికి రూమ్స్ చూపిస్తాడు పాట్రిక్. అయితే ఆ రోజు రాత్రి బియోన్ కు పక్కనే ఓ షెడ్ కనిపించడంతో అక్కడికి వెళ్తాడు. అక్కడకు పాట్రిక్ కొడుకు వచ్చి అతనితో ఎదో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ క్రమంలో అతని నాలుక కట్ అయ్యి ఉండడం బియోన్ గమనిస్తాడు. ఇక ఆ తర్వాత రోజు పాట్రిక్, బియోన్ ఫ్యామిలీ పిల్లలను వదిలేసి ఓ రెస్టారెంట్ కు వెళ్తారు.
ఇక అక్కడనుంచి అసలు కథ మొదలవుతుంది. పాట్రిక్, అతని భార్య.. బియోన్ కు అతని భార్యకు వింత వింతగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది ? పాట్రిక్ కుటుంబం ఎందుకు అలా బెహేవ్ చేస్తారు ? అసలు ఈ కథ ఎలా ముందుకు సాగుతుంది? అసలు పాట్రిక్ కుటుంబం మంచిదేనా ? పాట్రిక్ కొడుకుకు ఏమౌతుంది ? ఇవన్నీ తెలియాలంటే “స్పీక్ నో ఇవిల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. OTT లో బెస్ట్ సైకో కిల్లర్ మూవీ.. చనిపోయిన సైకో కిల్లర్ మళ్ళీ జన్మిస్తే !