Swetha
This Week Best Movies In OTT: ప్రతి వారం OTT లో పదుల సంఖ్యలో సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ వారం రాబోయే సినిమాలు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పి తీరాలి. మరి ఆ సినిమాలు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
This Week Best Movies In OTT: ప్రతి వారం OTT లో పదుల సంఖ్యలో సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ వారం రాబోయే సినిమాలు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పి తీరాలి. మరి ఆ సినిమాలు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
Swetha
ఈ నెలలో OTT లో ది బెస్ట్ అనిపించుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది.. సుమంత్ నటించిన అనగనగ సినిమానే. ఆ తర్వాత అంత ఇంట్రెస్టింగ్ అనిపించే సినిమాలు ఏమి రాలేదన్నది వాస్తవం. అయితే ఈ వారం మాత్రం ఐదు అదిరిపోయే సినిమాలు OTT లోకి వచ్చేస్తున్నాయి. వాటిలో ఓ తమిళ యాక్షన్ మూవీ , ఓ హాలీవుడ్ మూవీ కూడా రానుంది. మరి ఆ సినిమాలు ఏంటో ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
HIT 3 :
నాని మెయిన్ లీడ్ లో నటించిన హిట్ 3 మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఇది మొత్తం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అయినా సరే.. ఏజ్ డిఫరెన్స్ లేకుండా పెద్దవాళ్ళతో సహా ఈ సినిమాను ఆదరించారు. దానికి కారణం కేవలం నాని మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని.. మే 29 నుంచి నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. OTT లో కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పి తీరాలి. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినావారు ఎంచక్కా OTT లో ఓ లుక్ వేసేయండి.
రెట్రో :
సూర్య నటించిన ఈ సినిమా హిట్ తో పోటీగా రిలీజ్ అయింది. తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయినా సరే తమిళ్ ల మాత్రం పరవాలేదనిపించుకుంది. ఈ సినిమా కూడా థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుని OTT ఎంట్రీ ఇవ్వబోతుంది. మే 30 నుంచి ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
అజ్ఞాతవాసి:
ఇది ఒక కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ . ఏప్రిల్ 11 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి టాక్ నే సంపాదించుకుంది. ఈ సినిమాలో రంగనాయక రఘు , పావన గౌడ మెయిన్ లీడ్స్ గా నటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ OTT లో ఎంట్రీ ఇవ్వనుంది. మే 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు కానుంది ఈ మూవీ. క్రైం కథలకు ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే.
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్
హాలీవుడ్ మూవీస్ ను ఇష్టపడేవారైతే ఈ సినిమాను అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఈ సినిమా ఆల్రెడీ కొన్ని ఓటీటీ లలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు మే 28 నుంచి జియోహాట్‍స్టార్ లో రెగ్యులర్ స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా కాలమే అయింది. ఫిబ్రవరి 14 న ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఇప్పుడు OTT లోకి తీసుకుని వస్తున్నారు.
ఏ విడోస్ గేమ్:
ఇది ఒక స్పానిష్ క్రైమ్ డ్రామా. రీసెంట్ గానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఇవానా బకెరో, ట్రిస్టన్ ఉలావీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.
ఇక ఈ సినిమాలు కాకుండా మరిన్ని సినిమాలు ఈ వారం OTT లో రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. వీకెండ్ లోపు ఇంకా ఎలాంటి సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అవుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఓటీటీలో ఈవారం 5 అదిరిపోయే సినిమాలు.. హిట్ 3 స్ట్రీమింగ్.. మరో సూపర్ హిట్ యాక్షన్ మూవీ.. ఓ మిస్టరీ థ్రిల్లర్