OTT Suggestion: ఇండియన్ స్టార్ క్రికెటర్ మిథాలీ బయోపిక్ OTTలో ఉంది చూశారా? ఒక్కోసీన్ గూస్ బంప్స్!

నిజ జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఈ లిస్ట్ లోకి వచ్చేసాయి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

నిజ జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఈ లిస్ట్ లోకి వచ్చేసాయి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

సినిమాలను, సిరీస్ లను ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ ఉండడం సహజం. కానీ కొన్ని నిజ జీవిత సంఘటలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలను చూసేందుకు మాత్రం ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మనకు ఇప్పుడు వారు ఏ స్థాయిలో ఉన్నారో తెలిసినా కానీ.. ఇంత గొప్ప స్థాయికి రావడం కోసం వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. వాటి అన్నిటిని దాటి ఎలా ముందుకు సాగరు అనే విషయాలను.. సినిమాలు, డాక్యుమెంటరీల రూపంలో అందరికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటి ఒక రియల్ లైఫ్ స్టోరీ నే.. పైగా ఒక ఫేమస్ క్రికెటర్ స్టోరీ ఇది. మరి మీరు మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి. ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా ఒక మహిళా క్రికెటర్ కు సంబంధించిన స్టోరీ. ఈ సినిమాలో ఆమె క్రికెటర్ ఎలా ఎదిగింది. ఆ ప్రాసెస్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది అనే అన్ని విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. తాప్సి మెయిన్ లీడ్ గా చేసిన ఈ ఆటో బయో గ్రాఫి సినిమా మరెవరిదో కాదు. ప్రముఖ ఇండియా లేడి క్రికెటర్ మిథాలీ రాజ్ ది. భారత ఉమెన్స్ క్రికెటర్స్ అందరిలో మిథాలీ రాజ్ ఒక మార్క్ ను సెట్ చేసిందని చెప్పి తీరాలి. ఈ సినిమా పేరు.. “శభాష్‌ మిథు”. ఈ సినిమాకు శ్రీజిత్‌ దర్శకత్వం వహించారు. థియేటర్స్ లో విడుదలైన సమయంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి.. అనే విషయానికొస్తే..

ఈ సినిమా కథేంటంటే.. మిథాలీ చిన్నపటినుంచి కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఒకానొక సమయంలో ఆమె పిల్లలతో కలిసి గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న సమయంలో.. సంపత్ అనే కోచ్ ఆమె గేమ్ ను చూసి.. ఆమెకు ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగా ఆడుతుందని నమ్మి.. వాళ్ళ ఇంట్లో వారితో మాట్లాడి ఒప్పిస్తాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయిగా మిథాలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది! గేమ్ లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకుంది ! ఆమె గేమ్ ఆడుతున్నప్పుడు ఆమె కోచ్ చనిపోయాడని చెప్పినా సరే.. ఆ పరిస్థితులను ఎలా నెగ్గుగురాగలిగింది! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. క్రికెట్ ఇష్టమున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను అసలు మిస్ కాకూడదు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments