Bahubali Crown Of Blood: OTTలోకి సరికొత్త కథనంతో బాహుబలి మూవీ! కట్టప్పే ఇక్కడ విలన్!

రాజమౌళి తీసిన మాస్టర్ పీస్ సినిమా బాహుబలి.. తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమాను సరికొత్తగా ఓటీటీ లోకి తీసుకుని వస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజమౌళి తీసిన మాస్టర్ పీస్ సినిమా బాహుబలి.. తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమాను సరికొత్తగా ఓటీటీ లోకి తీసుకుని వస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాహుబలి సినిమా అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా ఉండేది అప్పట్లో.. అలాంటి ఇంపాక్ట్ ను అందరికి క్రియేట్ చేశాడు.. దర్శక ధీరుడు రాజమౌళి. మాహిష్మతి సామ్రాజ్యం, కట్టప్ప , బాహుబలి ఇలా ప్రతి పాత్ర గురించి చిన్న పిల్లలను నిద్రలో లేపి అడిగినా చెప్పేంతలా.. ఈ సినిమాను అందరి మనసులలో ముద్రించాడు జక్కన్న. ఇక ఇప్పుడు మాహిష్మతి రక్తంతో రాసిన సరికొత్త కథ అంటూ.. ఓ సినిమాను ఓటీటీ లోకి తీసుకురాబోతున్నాడు. అదే మాహిష్మతి సామ్రాజ్యంలో.. సరి కొత్త కథనంతో ఈ సినిమాను ముందుకు తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ సరికొత్త సినిమాకు పెట్టిన పేరు.. బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్. ఇది బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలకు కంటిన్యుషన్ అయితే కాదు కానీ.. ఈ సినిమా వీటికి ప్రిక్వెల్ అని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడు అదే మాహిష్మతి సామ్రాజ్యంలోకి మరొక శత్రువు ఎంటర్ అవ్వబోతున్నాడు. పైగా ఈ సినిమాలో కట్టప్ప విలన్ రోల్. వినడానికి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ సినిమా కథేంటంటే.. కొత్తగా ఎంటర్ అవ్వబోతున్న శత్రువు పేరు రక్త దేవ్. అతని సైన్యానికి అధిపతి కట్టప్ప. ఇక ఆ తర్వాత వారికీ శిక్షణ ఇచ్చిన వ్యక్తిపైనే మన సైన్యం ఎలా గెలుస్తుంది అంటూ.. బాహుబలి, భల్లాల దేవ్ ఇద్దరు యుద్దానికి దిగుతారు. ఆ తర్వాత ఏమైంది అన్నదే కథ, ఈ సినిమా కచ్చితంగా అందిరికి నచ్చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు ఇంకా బాగా నచ్చేస్తుంది, ఎందుకంటే ఇది పూర్తిగా ఒక యానిమేటెడ్ సినిమా. ఈ యాక్షన్ సిరీస్ హాట్‌స్టార్ లో మే 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు.. అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇక ఈ బాహుబలికి దర్శకుడు మాత్రం రాజమౌళి కాదు. జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ దీనిని డైరెక్ట్ చేయగా.. రాజమౌళి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అసలు బాహుబలి రెండు పార్ట్శ్ ప్రేక్షకులకు కావాల్సిన దానికంటే ఎక్కువ కంటెంట్ నే ఇచ్చిన తర్వాత కూడా.. మళ్ళీ ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఎలా వచ్చింది అనే ప్రశ్న అందరికి వచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానంగా రాజమౌళి స్పందిస్తూ.. “బాహుబలి ప్రపంచం చాలా పెద్దది. దానిని ఫిల్మ్ ఫ్రాంఛైజీ బాగా పరిచయం చేసింది. అయినా ఆ ప్రపంచంలో చూడటానికి ఇంకా చాలానే ఉంది. అక్కడి నుంచి వచ్చిందే ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహుబలి, భల్లాలదేవుడి జీవితాల్లోని ఓ రహస్యాన్ని, ట్విస్టులను ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ కొత్త కథను యానిమేటెడ్ రూపంలో బాహు అభిమానుల ముందుకు తీసుకురావడం చాలా ఉత్సాహంగా ఉంది”. అంటూ రాజమౌళి సమాధానం ఇచ్చారు. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments