OTT Movie: థియేటర్లలో విడుదలైన ఏడాదికి OTTలోకి కాజల్‌ హారర్‌ మూవీ!

ఓటీటీలో ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన చాలా నెలలకు ఓటీటీలో ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా.. కాజ‌ల్ అగ‌ర్వాల్, రెజీనా హీరోయిన్లుగా న‌టించిన తెలుగు హార‌ర్ మూవీ ఇన్నాళ్లకు ఓటీటీలోకి రానుంది.

ఓటీటీలో ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన చాలా నెలలకు ఓటీటీలో ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా.. కాజ‌ల్ అగ‌ర్వాల్, రెజీనా హీరోయిన్లుగా న‌టించిన తెలుగు హార‌ర్ మూవీ ఇన్నాళ్లకు ఓటీటీలోకి రానుంది.

ఈ మధ్య కాలంలో.. చాలా వరకు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్న క్రమంలో.. కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో విడుదలయ్యి నెలలు నెలలు గడిచిన తర్వాత కూడా ఓటీటీ దర్శనానికి కరువవుతున్నాయి. ఈ క్రమంలో ఇలా ఓటీటీలోకి వచ్చే సినిమాలు.. అనుకోని విధంగా సూపర్ సక్సెస్ సాధిస్తున్నాయి. ఇలానే ఇప్పుడు మరొక తెలుగు హార‌ర్ మూవీ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్, రెజీనా హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా పేరు “కాజల్ కార్తీక”. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి సంవత్సరం గడిచిపోయింది. ఎట్టకేలకు ఇంత కాలానికి .. తెలుగు హార‌ర్ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇవ్వనుంది. మరి, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

లేడీ ఓరియెంటెడ్ యాంగిల్ లో కాజల్ అగర్వాల్, రెజీనా హీరోయిన్లుగా నటించిన “కాజల్ కార్తీక” సినిమాకు.. డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాగా, ఈ సినిమా మొదట కరుంగాపియ‌మ్ పేరుతో త‌మిళంలో రూపొందించబడింది. ఆ తర్వాత కాజల్ కార్తీక పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. అయితే, ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా సమయంలో.. స్టోరీలో కొత్త‌ద‌నం మిస్స‌వ్వ‌డం, హార‌ర్ ఎలిమెంట్స్ అంతగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోవడంతో.. అటు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా.. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ఈ సినిమాలో కాజల్, రెజీనాతో పాటు.. రైజా విల్స‌న్‌, జ‌న‌ని అయ్య‌ర్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఐదు క‌థ‌ల‌తో ఆంథాల‌జీగా తెర‌కెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి, ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక కాజల్ కార్తీక సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాను .. లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఐదు కథలతో తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాలో మొదటి కథ.. రైజా విల్స‌న్‌ కు సంబంధించి ఉంటుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఆమె ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చినపుడు.. మరో యువకుడు ఆమెకు ఆశ్ర‌యం క‌ల్పిస్తాడు. కానీ అతను హంతకుడు అని తెలియడంతో ఆమె పారిపోవాలనుకుంటుంది. కానీ ఆమెను అతడు బంధిస్తాడు, ట్విస్ట్ ఏంటంటే ఆమె చనిపోయి ఉంటుంది, అసలు ఆమె ఎలా చనిపోయింది అనేదే ఈ ఫస్ట్ స్టోరీ. ఇక ఇంకొక కథ విషయానికొస్తే.. ఇది కాజల్ స్టోరీ.. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లో చిక్కుకుపోయిన కాజ‌ల్ ఓ యూట్యూబ్ వీడియో చేస్తుంది.. కానీ, అనుకోని విధంగా ఆమె వెనుక ఆ వీడియోలో మరొక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు! కాజల్ ఇంట్లోకి ఎందుకు వచ్చాడు, అసలు అతను మనిషేనా అనేదే కథ. ఇలా మొత్తం మరో మూడు స్టోరీలు ఉన్నాయి. కామెడీ, హర్రర్ టచ్ ఉన్న ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments