Venkateswarlu
Venkateswarlu
నెలసరి.. ప్రతీ స్త్రీ జీవితంలో ఓ గొప్ప పరిణామం. మాతృత్వానికి సంకేతం. అలాంటి ఓ గొప్ప విషయం గురించి జనం మాట్లాడటానికి జంకుతూ ఉంటారు. ఆడవారి జీవితంలో సర్వ సాధారణమైన ఈ విషయం గురించి ఎన్నో అపోహలు.. మరెన్నో మూఢ నమ్మకాలు. 21వ శతాబ్ధంలో ఉన్నా కూడా నెలసరి విషయంలో మాత్రం చాలా ముహమాటంగా ఉంటున్నారు జనం. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే నెలసరి విషయంలో రాబోయే తరాలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన జితేంద్ర దంపతులు ముందు వరుసలో ఉంటారు. వీరు తమ కూతురి మొదటి పీరియడ్స్‌ను పండగలా సెలెబ్రేట్ చేశారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్.. ఉద్ధంసింగ్ నగర్‌లోని కాశీపూర్‌కు చెందిన జితేంద్ర భట్ అనే వ్యక్తి సంగీత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతడు తన కూతురు రాగిణి మొదటి పీరియడ్స్‌ని ఇల్లంతా అలంకరించి పండగలా సెలెబ్రేట్ చేశాడు. తన భార్యతో కలిసి కూతురితో కేక్ కట్ చేయించాడు. ఈ కార్యక్రమానికి బంధువులను సైతం పిలిచి హంగామా చేశాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ నా చిన్నపుడు పీరియడ్స్ గురించి ఎక్కువగా తెలియదు. నేను పెద్దయ్యాక పీరియడ్స్ గురించి మాట్లాడితే మహిళలు, అమ్మాయిలు నన్ను చిన్న చూపు చూసేవాళ్లు.
పీరియడ్స్ గురించి అన్ని అపోహలు తొలగించాలని నా కూతురికి మొదటి పీరియడ్ జరిపించాను. ఇది అంటరాని వ్యాధి ఏమీ కాదు. సంతోషకరమైన రోజు’’ అని పేర్కొన్నాడు. ఇక, జితేంద్ర భట్ కేక్ మీద ‘హ్యాపీ పెరియడ్స్ డే’ అని రాయమన్నపుడు.. కేకు అమ్మేవ్యక్తి వింతగా చూశాడు. తాను ఇలాటి కేక్ చేయడం మొదటి సారి అంటూ ఆశ్చర్యపోయాడు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ హ్యాపీ పీరియడ్స్ రాగిణి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిజేయండి.