Viral Video: గంగా నదిపై బోటులో హుక్కా, చికెన్ పార్టీ, భగ్గుమంటున్న నెటిజెన్లు

  • Published - 07:54 PM, Thu - 1 September 22
Viral Video: గంగా నదిపై బోటులో హుక్కా, చికెన్ పార్టీ, భగ్గుమంటున్న నెటిజెన్లు

గంగా నదిపై బోటులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు హుక్కా తాగుతూ చికెన్ కాలుస్తున్న వీడియోపై సోషల్ మీడియా ఫైర్ అవుతోంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ దగ్గర్లో ఉన్న నాగ వాసుకి గుడికి సమీపంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం హిందువులు అతి పవిత్రంగా భావించే తీర్థ స్థలం. వీడియోలో మొత్తం 8 మంది ఉన్నారు. వీళ్ళలో ఒకరు హుక్కా పైప్ స్మోక్ చేస్తుండగా ఇంకొకరు చికెన్ ని రోస్ట్ చేస్తున్నారు. అదే బోటులో ఉన్న ఇంకొకతను వీడియో తీశాడు.
ఈ వీడియోపై నెటిజెన్లు భగ్గుమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని కొందరు విమర్శించారు. మరికొందరు వీడియోలో ఉన్నవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోలో ఉన్నవారిని గుర్తించి తగిన సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు చెప్పారు.

Show comments