iDreamPost
android-app
ios-app

యువకుడిపై దాడి చేసిన ముగ్గురు అమ్మాయిలు.. ఆ వీడియో నెట్‌లో పెట్టాడని..

యువకుడిపై దాడి చేసిన ముగ్గురు అమ్మాయిలు.. ఆ వీడియో నెట్‌లో పెట్టాడని..

తమకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టాడన్న కోపంతో ఓ యువకుడిపై ముగ్గురు యువతులు దాడి చేశారు. అతడి అడ్రస్‌ కనుక్కుని మరీ వెళ్లి అతడ్ని చితకబాదారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ ముగ్గురు కాలేజీ యువతులు స్కూటీపై వెళుతున్నారు. ఆ సమయంలో వారిలో ఎవ్వరికీ కూడా హెల్మెట్లు లేవు.  దీంతో ఓ ట్రాఫిక్‌ పోలీసు స్కూటీని ఆపాడు.

వారికి 2 వేల రూపాయల జరిమానా వేశాడు. అయితే, వారు ఆ ఫైన్‌ కట్టకపోగా.. ట్రాఫిక్‌ పోలీసుతో తగవుకు దిగారు. ఫైన్‌ కట్టకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. దీన్ని అక్కడే ఉన్న ఓ యువకుడు వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా దాన్ని ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది సదరు ముగ్గురు యువతుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు వీడియో తీసి, ట్విటర్‌లో పోస్టు చేసిన వ్యక్తిపై పగ బట్టారు. అడ్రస్‌ కనుక్కుని మరీ అతడి దగ్గరకు వెళ్లారు.

‘ మా వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెడతావా?.. నలుగురి ముందు మా పరువు తీస్తావా?’ అంటూ అతడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పును ఎత్తి చూపినందుకు కొట్టడం ఏంటంటూ ఆ యువతులపై జనం ఫైర్‌ అవుతున్నారు. అయితే, ఈ సంఘటనపై సదరు బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో.. లేదో తెలియరాలేదు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.