వీడియో పిచ్చితో జలపాతంలోకి దూకిన మాజీ జవాన్! చివరకి..

ఈ సమాజానికి ఏమైంది.. ఓ వైపు రీల్స్ పిచ్చితో కొందరు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటే.. మరోవైపు రీల్స్ మోజులో పడి కొందరు ప్రాణాలు పొగొట్టుకునే ఘటనలు జరుగుతున్నాయి. అయిన సరే కొందరు ఏమాత్రం బెదురు, భయం లేకుండా పోయింది. తాజాగా మరో ప్రాణం బలైంది.

ఈ సమాజానికి ఏమైంది.. ఓ వైపు రీల్స్ పిచ్చితో కొందరు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటే.. మరోవైపు రీల్స్ మోజులో పడి కొందరు ప్రాణాలు పొగొట్టుకునే ఘటనలు జరుగుతున్నాయి. అయిన సరే కొందరు ఏమాత్రం బెదురు, భయం లేకుండా పోయింది. తాజాగా మరో ప్రాణం బలైంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది సోషల్‌ మీడియాకు బాగా అడిక్ట్ అయ్యారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్‌, ఫాలోవర్స్‌ సంఖ్యను పెంచుకునే క్రమంలో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మరికొందరు రిస్క్ తీసుకుని మరీ.. వీడియోలు చేసేందుకు వెనుకాటం లేదు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో  వీడియోలు, రీల్స్ తీసే ప్రయత్నం చేస్తూ.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ మాజీ ఆర్మీ జవాన్ వీడియో కోసం జలపాతంలోకి దూకాడు. చివరకు.. ఆయన కుటుంబంలో విషాదం మిగిల్చాడు. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

మహారాష్ట్రలోని ఓ ప్రాంతానికి చెందిన స్వప్నికల్ ధావాడే(38) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన చాలా కాలం ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహించారు. కొంతకాలం క్రితం రిటైర్ అయ్యారు. ఈ క్రమంలోనే  తన కుటుంబంతో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే.… స్వప్నిల్ ధావాడే కి వీడియోలు చేయడం, యాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఇటీవల తన 30 మంది స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కి వెళ్లారు. తమిని ఘాట్ ప్రాంతంలో ఉన్న జలపాతం వద్దకు  వీరందరు వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ చాలా సేపు ఎంజాయ్ చేశారు.

ఇదే సమయంలో వాటర్ ఫాల్ పై నుంచి తాను దూకుతానని, అది వీడియో తీయాలని తన స్నేహితులకు చెప్పాడు. ఈ క్రమంలో అక్కడ వీడియో తీయమని చెప్పి స్వప్నిల్ ధావాడే వాటర్ ఫాల్స్‌లో దూకాడు. అయితే అతడికి ఈత వచ్చినప్పటికీ జలపాతం వద్ద నీటి ప్రవాహాం ఎక్కువగా ఉంటడంతో  కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాటర్ పాల్స్ కు చేరుకుని ధావాడే కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వాళ్లు ఎంత శ్రమించిన అతడి జాడ మాత్రం తెలియరాలేదు. చివరు రెండు రోజుల తర్వాత జలపాతంకి కింద ఉన్న సరస్సులో ధావాడే మృతదేహం లభించింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని భావించిగా..చివరకి విగతజీవిగా కనిపించాడు. ప్రస్తుతం అతడు జలపాతంలోకి దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ప్రమాదకరమైన స్టంట్స్ చేసి.. ప్రాణాల బలి చేసుకోవడం ఎందుకని పలువరుు అభిప్రాయ పడుతున్నారు.

Show comments