ఆ రాత్రి చేసిన చిన్న తప్పుతో.. ఆమె జీవితం తలక్రిందులు! అసలేమైందంటే..?

మంచి భర్త, కోరుకున్న లైఫ్ దొరికిందని సంబర పడిపోయింది కస్తూరి. అంతలో ఆమెను ఆనందాన్ని రెట్టింపు చేసే వార్త తెలిసింది. గర్భవతిని అయ్యానని తెలియడంతో భర్త, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

మంచి భర్త, కోరుకున్న లైఫ్ దొరికిందని సంబర పడిపోయింది కస్తూరి. అంతలో ఆమెను ఆనందాన్ని రెట్టింపు చేసే వార్త తెలిసింది. గర్భవతిని అయ్యానని తెలియడంతో భర్త, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతి పెళ్లైన అమ్మాయికి కలలు, కోరికలు ఉంటాయి. నగలు, నట్రానే కొనక్కర్లేదు.. తన భర్త తనను అర్థం చేసుకోవాలని, కూసంత ప్రేమగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అలాగే పిల్ల, పాపలతో తన సంసారం చక్కగా, హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ ఉంటుంది. ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది ఏ మహిళకైనా. ఇలాంటి ఆనందంలో మునిగి తేలుతుంది ఈ ఇల్లాలు కూడా. బంగారం లాంటి భర్త దొరికాడు అనుకుంది. తనను మించిన అదృష్టవంతురాలు లేదు అనుకుంది. కానీ విధి రాత ముందు తలవంచింది. పోతూ పోతూ తన కడుపులో ఉన్న బిడ్డను కూడా తీసుకుపోయింది. చిన్న ఏమరపాటు.. తప్పిదం నిండు గర్భిణీని బలితీసుకుంది. కస్తూరీ ఎందుకమ్మా ఇలా చేశావ్ అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు

తాను గర్భవతి కావడంతో.. శ్రీమంతం చేసుకోవాలనుకుంది. ఉత్సవాల్లో బేబీ షవర్ చేయాలనుకున్నారు కుటుంబం. ఎంతో ఆనందంగా బయలు దేరారు. కానీ మార్గమధ్యంలో రైలు నుండి జారి పడిపోయింది గర్భిణీ. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెన్ కాశీజిల్లా శంకరన్‌కోవిల్ సమీపంలోని మేలనీజితనల్లూర్ తూర్పు వీధికి చెందిన సురేష్ కుమార్.. చెన్నై పెరియార్ నగర్‌లోని త్రిశూలం ప్రాంతానికి చెందిన కస్తూరికి కొంత కాలం క్రితం వివాహం జరిగింది. కస్తూరి ఇటీవల గర్భవతి అని తెలియడంతో.. ఇంట్లోకి బుజ్జి పాపాయి రాబోతుందంటూ సంబరపడిపోయారు కుటుంబ సభ్యులు. ఆమెకు ఏడు నెలలు వచ్చాయి. దీంతో బేబీ షవర్ చేయాలనుకున్నారు. మేలనీజితనల్లూర్‌లో జరిగే ఆలయ ఉత్సవాల్లో పాల్గొని కస్తూరికి బేబీ షవర్‌ నిర్వహించాలని భావించారు

 కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు వెళ్లారు. అయితే చేతులు కడుక్కునేందుకు డోర్ వద్ద ఉన్న వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లింది కస్తూరి. చేతులు కడుక్కుని ఏమరపాటుగా అక్కడే డోర్ వద్ద నిల్చొని ఉండిపోయింది. అంతలో రైలు కుదుపుకు ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయింది. వెంటనే బంధువులు గుర్తించి రైలు చైన్ పట్టుకుని లాగారు. కానీ రైలు ఆగలేదు. అలాగే పక్క కంపార్ట్ మెంట్ వద్దకు వెళ్లి చైన్ లాగారు. చివరకు బంధువులు, భర్త వెనక్కు వెళ్లి చూడగా.. ఉలుందూరు పేట సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించింది కస్తూరీ. సేఫ్టీ చైన్ పనిచేసి ఉంటే, రైలు ఆగి ఉంటే కస్తూరిని రక్షించేవారని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విచారణలో రైల్వే యంత్రాంగం నివేదిక ఇచ్చింది. రైలులో ఎమర్జెన్సీ చైన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని, S9 కోచ్‌తో సహా రైలులోని మొత్తం 17 కోచ్‌లు పూర్తిగా పనిచేస్తున్నాయని, సరిగ్గా పుష్ చేసి ఉంటే రైలు ఆగేదని వివరణ ఇచ్చింది.

Show comments