ఆషాఢంలో అంబానీ ఇంట్లో పెళ్లి.. ఈ ముహూర్తం వెనుక రహస్యం ఇదే!

Ananth Ambani Wedding Ceremony: శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహం అంగరంగం వైభవంగా జరిగింది. ఇలా ఆషాఢ మాసంలో అంబానీ ఇంట పెళ్లి జరుగుతున్న నేపథ్యంలోనే తెలుగు వారిలో మాత్రం సందేహం వ్యక్తమవుతోంది. 

Ananth Ambani Wedding Ceremony: శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహం అంగరంగం వైభవంగా జరిగింది. ఇలా ఆషాఢ మాసంలో అంబానీ ఇంట పెళ్లి జరుగుతున్న నేపథ్యంలోనే తెలుగు వారిలో మాత్రం సందేహం వ్యక్తమవుతోంది. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అంబానీ ఇంట జరిగే పెళ్లి గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. అక్కడ పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు, ఏ కార్యక్రమాలు ఉంటాయి.. ఇలా అనేక రకాల విషయాల గురించి అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. కొన్ని నెలల నుంచి జరుగుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో పెళ్లి వేడుక కార్యక్రమాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు అనంత్ రాధిక దంపతులు ఒకటి కానున్నారు. ఇలా అంబానీ ఇంట పెళ్లి జరుగుతున్న నేపథ్యంలోనే తెలుగు వారిలో మాత్రం పెద్ద సందేహం వ్యక్తమవుతోంది.  మరి.. ఆ సందేహం ఏమిటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహం అంగరంగం వైభవంగా జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ పెళ్లి వేడుకకు దాదాపు 5వేల కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది. ఇదే సమయంలో మన తెలుగు వారికి ఓ పెద్ద సందేహం వచ్చింది. ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తోంది..మూఢం కూడా ఉంది. ఇలాంటి సమయంలో అంబానీ పెళ్లి ఎలా చేస్తున్నాడు అనే సందేహాలు చాలా మందికి వ్యక్తమయ్యాయి. ఇలాంటి మూఢంలో అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగటం వెనక ఒక బలమైన కారణం ఉంది.

అనంత్ అంబానీ పెళ్లి ముహూర్తాన్ని సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు ముహూర్తం నిర్ణయించారు.  ఈ పంచాంగం దృక్​గణితం ఆధారంగా రూపొందించడం జరిగింది. దీనిని సూర్యుడు కదలికల ఆధారంగా నిర్ణయిస్తారు.  అందుకే నార్త్ ఇండియన్స్ అమావాస్య తిథికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. దక్షిణాది వారు చంద్రుడి గమనం ఆధారంగా పంచాగాన్ని రూపొందిస్తారు.  అందుకే వారు వారు తీసుకునే అంశాలను బట్టి.. ప్రాంతాల మధ్య ఆచారాలు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అంబానీ ఇంట జరిగే పెళ్లి విషయంలో ఉత్తరాది పాటించే సూర్యమాన పంచాంగమే ఆధారంగానే పెళ్లి మూహుర్తం నిర్ణయించారు.

సూర్యమాన పంచాంగంలో అధిక మాసం ప్రస్థావన అనేదే ఉండదు. అందుకే తిథులు.. ముహూర్తాల విషయంలో ఉత్తరాదికి, దక్షిణాదికి చాలా తేడాలుంటాయి.  ఎవరి ప్రాంతంలో.. ఏ పంచాంగంఆచరిస్తారో.. ఆ పంచాంగం ప్రకారమే ముహూర్తాలు నిర్ణయిస్తారు. అందుకే అన్నీ ఆలోచించి అనంత్ అంబానీ పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ప్రపంచమంతా ఒకే ఆచారాలు. ఒకే పద్దతులు ఉండవు.  అలానే సమయం కూడా ఒకచోట ఒకరకంగా ఉంటే.. మరో చోట మరో సమయం ఉంటుంది.   అలానే ఇండియాలో కూడా  ప్రాంతాలను బట్టి ఆచారాలు మారుతాయి.

Show comments