Yashashri Masurkar: కంటతడి పెట్టిస్తున్న ప్రముఖ నటి లవ్‌ ఫెయిల్‌ స్టోరీ!

ప్రియుడు అన్న మాటలతో యశశ్రీక మాటలు రాలేదు. అతడి ప్రేమ మైకంలో ఉన్న ఆమె పిచ్చిదానిలా తయారైంది. కొన్ని నెలల పాటు ఎంతో నరకం అనుభవించింది. చివరకు ఎంతో కష్టం మీద బయటకు రాగలిగింది..

ప్రియుడు అన్న మాటలతో యశశ్రీక మాటలు రాలేదు. అతడి ప్రేమ మైకంలో ఉన్న ఆమె పిచ్చిదానిలా తయారైంది. కొన్ని నెలల పాటు ఎంతో నరకం అనుభవించింది. చివరకు ఎంతో కష్టం మీద బయటకు రాగలిగింది..

‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం’ అన్నాడు ఓ సినీ రచయిత. అయితే, అన్ని సందర్భాలకు ఇది సెట్‌ కాదు.. కొన్ని సందర్భాల్లో.. ‘ ప్రేమ ఎంత మధురం.. చెలికాడు అంత కఠినం’ అని కూడా పాడుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రియురాలి చేతిలో మోసపోయిన వాళ్లు ఎంత మంది ఉన్నారో.. ప్రియుడి చేతిలో మోసపోయిన ప్రియురాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. ఇందుకు సాధారణ జనం సెలెబ్రిటీలు అన్న తేడా లేదు.

కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్లు, నటీమణులలో కూడా ప్రియుడి చేతిలో మోసపోయిన వారు ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ యశశ్రీ మసుర్కార్‌ జీవితం. ఆమె ఓ వ్యక్తిని ఎంతో ప్రాణంగా ప్రేమించింది. అతడే జీవితం అనుకుంది. అయితే, అతడు మాత్రం.. ఆమెను మోసం చేశాడు. దీంతో యశశ్రీ కొన్ని నెలల పాటు నరకం అనుభవించింది. చివరకు ప్రేమ, పెళ్లి అంటేనే భయపడే స్థితికి వచ్చింది. ఒక వేళ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడితే.. పెళ్లి ఎందుకు అని ప్రశ్నిస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే… బాలీవుడ్‌ నటి మాసుర్కర్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే, అతడు నటుడు కాదు. పేరు కూడా బయటకు చెప్పలేదు. అందరు అమ్మాయిలలాగే తమ బంధం ఎంతో ద్రుఢమైనదని ఆమె అనుకుంది. అతడ్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని కలలు కంది. అన్నీ అనుకున్నట్లుగానే జీవితం ఎందుకు అవుతుంది. ఓ రోజు అతడు ఆమెకు షాక్‌ ఇచ్చాడు. ‘ నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి అంటేనే ఇష్టం లేదు’’ అని అన్నాడు. అతడి మాటలతో ఆమె కాళ్లకింద నేల కంపించింది. నాలుగేళ్ల ప్రేమ ప్రయాణానికి అతడు ముగింపు చెప్పటంతో తట్టుకోలేకపోయింది.

ప్రియుడి ప్రేమలో పూర్తిగా మునిగిన ఆమె ఆ మైకంలోంచి బయటకు రావటానికి నరకం అనుభవించింది. పిచ్చిదైపోయింది. అతడికి కష్టం వస్తే ఆమె విలవిల్లాడిపోయింది. అతడు యశశ్రీతో కష్టసుఖాలు పంచుకున్నాడు. అర్థాంతరంగా వదిలేయటంతో తట్టుకోలేకపోయింది. చివరకు కొన్ని నెలల తర్వాత రియలైజ్‌ అయింది. ఓ తప్పుడు వ్యక్తిని ప్రేమించాను అని తనకు తాను సర్ది చెప్పుకుంది. పెళ్లి జోలికే వెళ్లకూడదని డిసైడ్‌ అయింది. ప్రేమించే వ్యక్తితో హాయిగా ఉండటానికి పెళ్లి ఎందుకు అంటోంది. అసలు పెళ్లి గోలే అవసరం లేదు అంటోంది. పెళ్లి చేసుకోవటం కంటే .. సింగిల్‌గా ఉండటమే మంచిది అని సలహా ఇస్తోంది. ​మరి, బాలీవుడ్‌ నటి యశశ్రీ లవ్‌ ఫెయిల్‌ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

Show comments