Venkateswarlu
సమంత ప్రస్తుతం సినిమాలకు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నారు. దేశ దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కొత్త నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు...
సమంత ప్రస్తుతం సినిమాలకు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నారు. దేశ దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కొత్త నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు...
Venkateswarlu
స్మైలింగ్ క్వీన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. వెకేషన్ మూడ్‌లో ఉన్నారు. మైయోసైటిస్‌కు చికిత్స కోసం ఆమె చిత్రాలనుంచి దాదాపు 4 నెలలుగా దూరంగా ఉంటున్నారు. నెల క్రితమే చికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. అయినప్పటికి ఆమె ఇంకా మూవీస్‌కు దూరంగా ఉంటున్నారు. స్నేహితురాలితో కలిసి దేశ దేశాలు తిరుగుతున్నారు. పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తూ సేద తీరుతున్నారు. మరో వైపు యాడ్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు.
తనకు సంబంధించిన విషయాలను వారితో షేర్ చేసుకుంటున్నారు. నటనలో తనను తాను నిరూపించుకున్న సమంత ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సొంతంగా ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు ‘ ట్రలాల మూవింగ్ పిక్షర్స్’. ఇందుకు సంబంధించిన విషయాలను నిన్న ఆమే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ ‘‘ నా కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను అనౌన్స్ చేయడం ఎంతో ఉత్సాహంగా ఉంది.
ట్రలాల మూవింగ్ పిక్షర్స్.. కొత్త తరపు భావాలను ఆలోచనలను తెరపైకి తెచ్చే కంటెంట్‌ను ట్రలాలా నిర్మిస్తుంది. సామాజిక విషయాల గురించి మాట్లాడే కథలకు పెద్ద పీట వేస్తుంది. అర్థవంతమైన, ప్రపంచ వ్యాప్తమైన కథల్ని చెప్పే ఫిల్మ్ మేకర్స్‌కు మంచి వేదిక’’ అని అన్నారు. ఇంతకీ ట్రలాల అంటే ఏంటంటే.. ఇదొక పాటలోని పదం. దీని అర్థం ఏంటంటే.. సంతోషాన్ని వ్యక్త పర్చడం. సమంత చిన్నప్పుడు ట్రలాల పాటను వింటూ పెరిగిందట. ఆ పాట స్పూర్తితోనే తన సంస్థకు ట్రలాల అని పెట్టుకుంది.
కాగా, సమంత 2023లో ఖుషీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాలేదు. ఇక, సమంత చిత్రాలకు బ్రేక్ ఇవ్వడానికి ముందు ‘సిటడెల్’ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ పూర్తయిన వెంటనే ఆమె చెన్నై స్టోరీస్ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటించనున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇది సమంత చెన్నై స్టోరీస్‌తోటే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తర్వాత కంటిన్యూగా సినిమాలు చేయనున్నారు. ఓ వైపు నటిగా కొనసాగుతూనే.. మరో వైపు సినిమాలను నిర్మించనున్నారు. మరి, స్మైలింగ్ క్వీన్ సమంత ట్రలాల పేరుతో ఓ నిర్మాణ సంస్థను మొదలుపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.