ఈ నటిని గుర్తుపట్టారా.. సలార్‌లో తన మార్క్ యాక్టింగ్‌తో చంపేసిందంతే

ఒక హీరో నటన చూస్తుంటే ఏం చేశాడ్రా అనిపించకమానదు. వాళ్లకు యాక్టింగ్ పరంగా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మరీ నటీమణుల విషయానికి వస్తే.. అలాంటి అవకాశాలు చాలా తక్కువ. వీరికి ఉన్న సినిమా లైఫ్ తక్కువ కాబట్టి.. వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. కానీ కొంత మంది ఫ్రూవ్డ్ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తుంటారు.

ఒక హీరో నటన చూస్తుంటే ఏం చేశాడ్రా అనిపించకమానదు. వాళ్లకు యాక్టింగ్ పరంగా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మరీ నటీమణుల విషయానికి వస్తే.. అలాంటి అవకాశాలు చాలా తక్కువ. వీరికి ఉన్న సినిమా లైఫ్ తక్కువ కాబట్టి.. వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. కానీ కొంత మంది ఫ్రూవ్డ్ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తుంటారు.

గతంలో హీరోయిన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే మహిళలకు మంచి రోల్స్ దక్కేవి. కుటుంబ కథా చిత్రాలు వచ్చేవి కాబట్టి.. మూవీస్ మొత్తం వారే కనిపించారు. ఆ తర్వాత హీరోయిజం పాతుకుపోయింది. దీంతో హీరోయిన్లు ఆరు పాటలు, కొన్ని సీన్లకు పరిమితమయ్యారు. ఈ మూసధోరణికి ఇప్పుడు కాస్త స్వస్థి పలికారు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. కథలో వారికి కీలక పాత్ర ఉంటేనే సినిమాలకు పచ్చ జెండా ఊపుతున్నారు. దర్శకులు కూడా వీరి చుట్టూ కథ ఉండే విధంగా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. మసూద, విరూపాక్ష మూవీస్‌లో హీరోయిన్లతో పాటు ఇతర మహిళా క్యారెక్టర్లకు మంచి ప్రాధాన్యత దక్కింది. తాజాగా విడుదలైన సలార్ మూవీలో కూడా రెండు ఉమెన్ క్యారెక్టర్లు అద్బుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ వర్మ.

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా.. ఇప్పుడు సలార్ మూవీలో హీరోలు, విలన్లను ధీటుగా నటించింది. ప్రభాస్, పృధ్వీరాజ్, జగపతి బాబు వంటి భారీ కటౌట్లు ఉన్నా.. తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఈ అమ్మాయి.. ఇప్పుడు ఓ పెద్దింటి కోడలు. ప్రముఖ కోలీవుడ్ హీరోకు వదిన కూడా. ఆమె మరెవ్వరో కాదూ..శ్రియా రెడ్డి. శ్రియా రెడ్డి చాలా మందికి నటిగానే తెలుసు కానీ. ఆమె ఒక వీడియా జాకీ. ఎస్ ఎస్ మ్యూజిక్‌లో ఆమె యాంకరింగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ డస్కీ బ్యూటీ తీరుకు, యాంకరింగ్ స్కిల్స్ చూసి సినిమా అవకాశాలు వచ్చాయి. సమురాయ్ అనే మూవీలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిన శ్రియా.. అప్పుడప్పుడు అనే మూవీతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఈ మూవీలో ఫోటో స్టిల్ నే ఇప్పుడు మీరు చూస్తుంది. ఆ మూవీలో ముక్కోపి, పొగరబోతుగా నటించింది శ్రియ. ఆ తర్వాత తమిళ్, ఇంగ్లీష్, మలయాళ చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగులో అమ్మ చెప్పింది అనే మూవీలో కూడా కనిపిస్తోంది. కానీ ఆమె అందరికి స్ట్రైక్ అయ్యింది మాత్రం తిమిరు మూవీతోనే. ఇది తెలుగులో పొగరు అనే పేరుతో డబ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో ఆమె యాక్టింగ్ వేరే లెవల్. హీరో కోసం తాపత్రయ పడే విలనీ క్యారెక్టర్‌లో భయపెడుతుంది. ఈ మూవీ సమయంలో ఆ సినిమా నిర్మాత, విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణతో ప్రేమలో పడి.. 2008 వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. భర్తతో కలిసి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది.

పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తెలుగులో సలార్ మూవీలో నటించింది. ఇందులో జగపతిబాబు కూతురిగా నటించింది శ్రియా రెడ్డి. రాధ రమా మన్నార్ క్యారెక్టర్‌లో మెస్మరైజ్ చేసింది. విలనీగా అద్భుతంగా నటించింది. మరోసారి తనదైన యాక్టింగ్‌తో కట్టిపడేసింది. అగ్రెసివ్‌ నటనతో ఆకట్టుకుంది. పొగరులో ఆమె యాక్టింగ్ చూసిన వాళ్లకు.. ఆమె స్టామినా ఏంటో ఇట్టే తెలుసు. ఆ ఫెర్మామెన్స్ కు కాస్త ఎక్కువే ఇచ్చింది కానీ.. తగ్గలేదు. తెలుగు కంబ్యాక్ మూవీలో తన యాక్టింగ్‌తో ఇచ్చి పడేసిందంతే. ఇక ఆమె పవన్ కళ్యాణ్, సాహో దర్శకుడు సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. మరీ పొగరు, సలార్ మూవీల్లో శ్రియా రెడ్డి నటన ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments