RS 2000 Crore Scam: రూ.2వేల కోట్ల మోసం కేసులో ప్రముఖ సినీ నటుడు!

RK Suresh: రూ.2వేల కోట్ల మోసం కేసులో ప్రముఖ సినీ నటుడు!

ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత సురేష్‌ దుబాయ్‌ నుంచి చెన్నై వచ్చారు. ఆయన్ని ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు విచారించారు..

ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత సురేష్‌ దుబాయ్‌ నుంచి చెన్నై వచ్చారు. ఆయన్ని ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు విచారించారు..

ఆరుద్ర గోల్డ్‌ స్కామ్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రముఖ తమిళ నటుడు ఆర్‌కే సురేష్‌ హస్తం కూడా ఉందన్న వార్తలు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేసు ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ఆర్‌కే సురేష్‌ దేశం విడిచి వెళ్లిపోయారు. గత కొన్ని నెలలుగా వేరే దేశంలో తలదాచుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆరుద్ర గోల్డ్‌ స్కామ్‌ కేసుతో ఆయనకు సంబంధం ఉందన్న అనుమానంతో ఎకనామిక్‌ ఎఫెన్స్‌ వింగ్‌ అధికారులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

డిసెంబర్‌ 12వ తేదీన ఎకనామిక్‌ ఎఫెన్స్‌ వింగ్‌ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. సురేష్‌కు నోటీసులు చేరాయి. దీంతో దుబాయ్‌లో దాక్కున్న ఆయన ఇండియాకు వచ్చాడు. ఇక, 2400 కోట్ల ఈ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే 22 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసు గురించి సీనియర్‌ సిటీ పోలీసు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ ఎకనామిక్‌ ఎఫెన్స్‌ వింగ్‌ సురేష్‌కు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. అతడి బ్యాంకు ఖాతాలను నిలిపివేసింది. అతడు గత కొన్ని నెలలుగా విదేశంలో దాక్కున్నాడు.

ఎకనామిక్‌ ఎఫెన్స్‌ వింగ్‌ పంపిన సమన్లను కొట్టి వేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశాడు. అయితే, కోర్టు అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. డిసెంబర్‌ 12న విచారణకు హాజరు కావాలని ఈఓడబ్ల్యూ అతడ్ని ఆదేశించింది. ఆదివారం దుబాయ్‌నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన సురేష్‌ను ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు గంటన్నరకుపైగా విచారించారు. సిటీలో ఉన్న ఈఓడబ్ల్యూ ఆఫీస్‌కు వస్తానని అతడు హామీ ఇచ్చాడు. దీంతో అధికారులు అతడ్ని విడిచిపెట్టారు’’ అని తెలిపాడు.

కాగా, సురేష్‌ తమిళ నిర్మాత డాక్టర్‌ ఆర్‌ కలాంజియమ్‌ కుమారుడు. సురేష్‌ సినిమాల్లో నటుడిగా తొలి అవకాశం సంపాదించడానికి చాలా కష్టపడ్డారు. ప్రొడక్షన్‌ హౌస్‌ల చుట్టూ తిరిగారు. 2011లో వచ్చిన ‘‘ తంబికోట్టై’’ చిత్రంతో నిర్మాత అయ్యారు. 2012లో సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. 2016 వరకు ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే.. డిస్ట్రిబ్యూషన్‌ కూడా చేసేవారు. 2016లో వచ్చిన ‘‘ తారై తప్పటై’’ అనే సినిమాతో నటుడిగా మారారు. తమిళం బిజీ యాక్టర్‌గా మారారు. తమిళంతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేస్తున్నారు.

2023లో ‘‘థగ్స్‌’’ అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరుద్ర స్కామ్‌ కారణంగా సురేష్‌ సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నేర రుజువైతే ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరి, ఆరుద్ర కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments