కల్కితో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే మూమెంట్

Prabhas Rare Record: కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రభాస్ అరుదైన రికార్డు సాధించారు. ఇలా చరిత్ర సృష్టించడం ఇది రెండోసారి. వరుసగా రెండు సార్లు ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ ఉన్నారు. ఇది నిజంగా ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేసుకునే మూమెంట్.

Prabhas Rare Record: కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రభాస్ అరుదైన రికార్డు సాధించారు. ఇలా చరిత్ర సృష్టించడం ఇది రెండోసారి. వరుసగా రెండు సార్లు ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ ఉన్నారు. ఇది నిజంగా ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేసుకునే మూమెంట్.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాతో చరిత్ర సృష్టించారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపిస్తోంది. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ సినిమాతో ప్రభాస్ రెండోసారి వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ ని అందుకున్నారు. అంతకు ముందు బాహుబలి 2 తో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన హీరోగా రికార్డు దక్కించుకున్నారు. బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాగా తాజాగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా అరుదైన రికార్డుని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది.

ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన సినిమాలు ఆరు ఉండగా.. ప్రభాస్ కల్కి సినిమా 7వ స్థానంలో ఉంది. దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, జవాన్, పఠాన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసాయి. దంగల్ సినిమా రూ. 2024 కోట్లు వసూలు చేయగా.. బాహుబలి 2 రూ. 1810 కోట్లు వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్ రూ. 1387 కోట్లు, కేజీఎఫ్ 2 రూ. 1250 కోట్లు, జవాన్ రూ. 1148 కోట్లు, పఠాన్ రూ. 1050 కోట్లు వసూలు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన 7 సినిమాల్లో మూడు తెలుగు సినిమాలు ఉండడం విశేషం. అయితే ప్రపంచవ్యాప్తంగా రెండు సార్లు వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిన హీరోల్లో షారుక్ ఖాన్, ప్రభాస్ ఉండడం విశేషం.

ప్రభాస్ రెండు సార్లు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని సాధించి అరుదైన రికార్డుని దక్కించుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. దంగల్ నుంచి పఠాన్ వరకూ సినిమాలు ఫుల్ రన్ లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. అయితే కల్కి ఇంకా రన్ లో ఉంది కాబట్టి ఈ వసూళ్లు ఇంకా పెరుగుతాయి. ఇక నార్త్ అమెరికాలో కూడా కల్కి అరుదైన రికార్డుని సాధించింది. అక్కడ 16.2 మిలియన్ డాలర్లు వసూలు సాధించి నాన్ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టింది. బుక్ మై షోలో కోతికి పైగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా కల్కి సినిమా మరో రికార్డు సృష్టించింది. మరి ప్రభాస్ నటించిన కల్కి సినిమా, ప్రభాస్ ఈ అరుదైన రికార్డు సాధించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments