Sarwat Gilani-Postpartum Depression: బిడ్డ పుట్టి నాలుగు రోజులే.. తనని చంపాలనుకున్నాను: నటి

బిడ్డ పుట్టి నాలుగు రోజులే.. తనని చంపాలనుకున్నాను: నటి

ప్రముఖ నటి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసింది. బిడ్డ పుట్టిన నాలుగు రోజులకే తనను చంపాలనుకుందట. ఆ వివరాలు..

ప్రముఖ నటి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసింది. బిడ్డ పుట్టిన నాలుగు రోజులకే తనను చంపాలనుకుందట. ఆ వివరాలు..

మాతృత్వం ఆడవారికి లభించిన గొప్ప వరంగా భావిస్తారు. ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వాలని.. అమ్మ అని  పిలిపించుకోవాలని ఆశపడుతుంది. బిడ్డకు జన్మనివ్వడం అంటే మహిళ మరో జన్మ ఎత్తినంత విలువ. కొన్నిసార్లు పురిట్లో ప్రాణం పోతుందని తెలిసినా.. బిడ్డకు జన్మనివ్వడానికే మొగ్గు చూపుతారు. గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టే వరకు జరిగే సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా సరే వాటన్నింటిని చిరునవ్వుతో భరిస్తారు. ఇక ప్రసవం తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆపరేషన్‌ ద్వారా డెలివరీ చేస్తే.. ఆ బాధ మరింత కష్టం. వీటన్నింటిని లెక్క చేయక.. బిడ్డకు జన్మనిచ్చి మురిసిపోతుంది మహిళ. ఆ చిన్నారికి ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాచుకుంటుంది. తల్లి ప్రేమంటే అలానే ఉంటుంది.

కానీ ఓ నటి మాత్రం ఇందుకు భిన్నమైన కామెంట్స్‌ చేసింది. డెలివరీ అయిన నాలుగు రోజులకే తన బిడ్డను తన చేతులతో స్వయంగా పైకి పంపాలని భావించిందట. ఎంతో ఆవేదనతో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇంతకు నటికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది.. ఆమె ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్‌ చేసిందంటే..

ప్రసవానంతరం డిప్రెషన్‌తో బాధపడుతూ.. బిడ్డను చంపాలనుకుందంట ఓ నటి. అయితే ఆమెది మన దేశం కాదు పాకిస్తాన్‌. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అవుతోంది. సర్వత్‌ గిలానీ అనే పాక్‌ నటి ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను గర్భం దాల్చాను అని తెలిసి ఎంతో సంతోషపడ్డాను. ప్రెగ్నెన్సీని చాలా ఎంజాయ్‌ చేశాను. అయితే డెలివరీ సమయంలో నాకు సర్జరీ చేశారు. దాంతో నాలుగు రోజుల తర్వాతే నా బిడ్డను ఎత్తుకునే అవకాశం లభించింది. అయితే డెలివరీ తర్వాత నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను’’అని చెప్పుకొచ్చింది.

‘‘సర్జరీ జరగడంతో.. బిడ్డ పుట్టిన నాలుగు రోజుల తర్వాత తనను నా దగ్గరకు తీసుకువచ్చారు. అప్పుడు పాలివ్వడానికి నేను.. తాగడానికి తను చాలా ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఒక్కటే అనిపించింది. ఈ బాధను భరించే బదులు.. పాప చనిపోయినా బాగుండేది అనుకున్నాను. నవ మాసాలు మోసి.. కన్న బిడ్డను నేనే పైకి పంపాలనుకున్నాను. ఇలాంటి ఆలోచనలు రావడం పాపం అని నాకు తెలుసు. కానీ నా మీద నాకు కంట్రోల్‌ లేకుండా పోయింది. దాంతో నా భర్తకు ఫోన్‌ చేసి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నట్లుగా చెప్పాను’’ అని గుర్తు చేసుకుంది.

‘‘నా భర్తకు నా సమస్య ఏంటో అర్థం అయ్యింది. నన్ను ఓదార్చాడు. ప్రసవానంతరం వచ్చే మానసిక ఒత్తిడి కారణంగా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి.. ముందు పోస్ట్‌ మార్టమ్‌ డిప్రెషన్‌ అంటే ఏంటో తెలుసుకో.. అప్పుడు నీ సమస్య గురించి నీకంటూ ఓ అవగాహన వస్తుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో నీకే తెలుస్తుందని ఓదార్చాడు’’ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమస్యతో బాధపడేవారికి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతోనే దీని గురించి చెప్పుకొచ్చానని వెల్లడించింది.

Show comments