Venkateswarlu
ప్రముఖ నటుడు ఒకరు ఓ పిల్లాడిపై చెయ్యి చేసుకున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు నటుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ నటుడు ఒకరు ఓ పిల్లాడిపై చెయ్యి చేసుకున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు నటుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Venkateswarlu
ఇండియాలో సినిమా తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో, హీరోయిన్లను దేవుళ్లుగా పూజించటం.. గుళ్లు కట్టడం వంటి సంప్రదాయం కేవలం ఇండియాలో మాత్రమే ఉంది. సినిమా తారలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వారితో బ్రాండ్ ప్రమోషన్లు చేయించుకుంటూ ఉంటారు. ఇక, సినీ తారలు ఎక్కడ కనిపించినా వారి చుట్టూ జనం ఈగల్లా ముగుతూ ఉంటారు. ఫొటోలు, సెల్ఫీల కోసం పోటీ పడుతుంటారు. కొన్ని సార్లు ఇదే సినిమా తారలకు ఇబ్బంది తెచ్చిపెడుతుంది.
సినీ తారలు ఫ్యాన్స్ పెట్టే ఇబ్బంది కారణంగా అసహనానికి గురై వారిపై చెయ్యి చేసుకుంటున్న సంఘటనలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్ ఓ ఫ్యాన్‌పై చెయ్యి చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఇబ్బంది పెట్టడంతో ఆయన ఫ్యాన్‌ను కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నానా పటేకర్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగింది.. నానా పటేకర్ ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లారు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. నానా పటేకర్‌ను చూడ్డానికి పోటీ పడ్డారు. షూటింగ్ టేక్ బ్రేక్ సమయంలో నానా పటేకర్‌తో పాటు మిగిలిన సినిమా టీం ఓ చోట ఉంది. అక్కడికి ఓ పిల్లాడు వచ్చాడు. నానా పటేకర్‌తో ఫొటో దిగాలని అనుకున్నాడు. అయితే, ఆ నటుడు పిల్లాడి కారణంగా ఇబ్బందికి గురయ్యారు. పక్కకు వెళ్లమంటూ అతడిపై చెయ్యి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో నానా పటేకర్ స్పందించారు. ఫ్యాన్‌పై చెయ్యి చేసుకున్న సంఘటనపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు నిన్న ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో .. ‘‘ ‘‘నేను ఓ పిల్లాడిపై చెయ్యి చేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మా సినిమాలో భాగంగానే జరిగింది. మేము సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నాము. ఓ టేక్ కంప్లీట్ అయ్యింది. ఇంకో టేక్ కోసం రిహార్సల్ చేస్తున్నాము. ఆ సమయంలో ఓ పిల్లాడు అనుకోని విధంగా సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు.
నేను అతడ్ని మా టీంలోని వ్యక్తి అనుకున్నాను. స్క్రిప్ట్‌ను ఫాలో అవుతూ ఆ పిల్లాడిని కొట్టాను. తర్వాత తెలిసింది. అతడు మా టీంలో భాగం కాదని. నేను అతడ్ని కలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పటికే అతడు వెళ్లిపోయాడు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు. నిర్లక్ష్యం కారణం జరిగింది. నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు. మరి, పిల్లాడిపై చెయ్యి చేసుకున్న సంఘటనకు సంబంధించి నానా పటేకర్ క్షమాపణ చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.