Swetha
Kubhera : సినిమా రిలీజ్ ముందు టీజర్స్ ఎవరైన రిలీజ్ చేస్తారు. కానీ మిగిలిన టీజర్స్ అన్ని ఓ ఎత్తు నిన్న రిలీజ్ చేసిన కుభేర టీజర్ ఓ ఎత్తు. టీజర్ కట్ అంటే డైలాగ్స్ ఉండాలి క్యారెక్టర్స్ ని పరిచయం చేయాలి. కథ ఏంటి అనేది క్లారిటీగా చెప్పకపోయినా చెప్పి చెప్పనట్టు కొన్ని సీన్స్ ఉండాలి. ఇదే ఫార్మట్ కు అలవాటు పడిపోయారు అంతా. కానీ కుభేర టీజర్ మాత్రం ఇలా రొటీన్ గా లేకుండా ఫ్రెష్ ఫీలింగ్ ను ఇచ్చిందని చెప్పి తీరాలి.

శేఖర్ కమ్ముల సినిమాలన్నీ కూడా వేరే ట్రాక్ లో ఉంటాయి. గ్యాప్ తీసుకుంటూ అప్పుడప్పుడు సినిమాలు తీసినా కానీ.. ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే మాత్రం.. కచ్చితంగా అది ఇంకో కొన్నేళ్ల పాటు చెప్పుకోదగిన సినిమానే అవుతుంది. ఇప్పుడు కుభేర సినిమా విషయంలో కూడా అదే టాక్ వినిపిస్తుంది. ధనుష్ , నాగార్జున , రష్మీక ప్రధాన పాత్రలలో నటిస్తున్న కుభేరపై ఇప్పటికే ప్రేక్షకుల మధ్య ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తుందా అని ఎదురుచూసారు అంతా. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
అయితే సినిమా రిలీజ్ ముందు టీజర్స్ ఎవరైన రిలీజ్ చేస్తారు. కానీ మిగిలిన టీజర్స్ అన్ని ఓ ఎత్తు నిన్న రిలీజ్ చేసిన కుభేర టీజర్ ఓ ఎత్తు. టీజర్ కట్ అంటే డైలాగ్స్ ఉండాలి క్యారెక్టర్స్ ని పరిచయం చేయాలి. కథ ఏంటి అనేది క్లారిటీగా చెప్పకపోయినా చెప్పి చెప్పనట్టు కొన్ని సీన్స్ ఉండాలి. ఇదే ఫార్మట్ కు అలవాటు పడిపోయారు అంతా. కానీ కుభేర టీజర్ మాత్రం ఇలా రొటీన్ గా లేకుండా ఫ్రెష్ ఫీలింగ్ ను ఇచ్చిందని చెప్పి తీరాలి. నాదే నాదే నాదే అంటూ మనిషి డబ్బు కోసం ఎంత దూరమైన వెళ్తాడు అనే కాన్సెప్ట్ ను.. శేఖర్ కమ్ముల తన స్టైల్ లో చూపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
సింపుల్ గా టీజర్ ని బట్టి చెప్పాలంటే ఓ పెద్ద కోటీశ్వరుడు ఓ బిచ్చగాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి వీరి ముగ్గురి మధ్య జరిగే మూడుముక్కలాట కుభేర. ఈ మొత్తాన్ని ఓ సాంగ్ తో టీజర్ లో చూపించాడు దర్శకుడు. మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ గురించి చిన్న చిన్న క్లూస్ ఇచ్చాడు కానీ పూర్తిగా అయితే చెప్పలేదు. మొత్తానికి టీజర్ కట్ తో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పి తీరాల్సిందే. జూన్ 20 న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చే ట్రైలర్ సినిమా మీద ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.