Venkateswarlu
Venkateswarlu
జబర్థస్త్ కమెడియన్, సింగర్ సందీప్‌పై కొద్దిరోజుల క్రితం ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సందీప్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. లైంగికంగా వాడుకున్న తర్వాత సందీప్ తనను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం లేదని ఆ యువతి తెలిపింది. ఇక, యువతి ఇచ్చిన ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సందీప్‌ను తాజాగా, అరెస్ట్ చేశారు.
గోల్కొండ ప్రాంతంలో ఉంటున్న సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళితే.. పాటలతో పాటు, కామెడీతో సందీప్ చాలా ఫేమస్ అయ్యాడు. జబర్థస్త్‌తో పాటు ఇతర కామెడీ షోలలో కూడా అతడు పాల్గొన్నాడు. ఇతడికి 2018లో వాట్సాప్ ద్వారా ఓ యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే సందీప్ ఆమెను హైదరాబాద్ రప్పించాడు. ఆమె గత నాలుగేళ్లుగా షేక్‌పేటలోని ఓ హాస్టల్లో ఉంటోంది.
ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ ఆ యువతిని శారీరకంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురావటంతో అతడు ముఖం చాటేశాడు. ఆమెను దూరం పెట్టడం మొదలెట్టాడు. తాను వేరే యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు యువతికి చెప్పాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. సందీప్‌పై కేసు పెట్టడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మరి, యువతిని మోసం చేశాడన్న కేసులో కమెడియన్ సందీప్ అరెస్ట్ కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.