Nidhan
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ భారీ సాహసం చేశారు. వాళ్లిద్దరి కెరీర్లో ఇంత పెద్ద రిస్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ భారీ సాహసం చేశారు. వాళ్లిద్దరి కెరీర్లో ఇంత పెద్ద రిస్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
Nidhan
ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని కాంబినేషన్ల మీద ఆడియెన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. వాళ్లు కలసి తీసే సినిమాలకు బిజినెస్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. టాలీవుడ్లో అలాంటి హిట్ కాంబోనే రామ్ పోతినేని-పూరి జగన్నాథ్. వీళ్ల కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఏ రేంజ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్, రామ్ నటన, తెలంగాణ యాసలో ఆయన చెప్పిన సంభాషణలు, పూరి రాసిన డైలాగులు థియేటర్లో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించాయి. అందుకే వీళ్ల కాంబోలో నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ కాంబో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌తో మరోమారు బాక్సాఫీస్ దుమ్ము లేపేందుకు సిద్ధమవుతున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్-పూరి భారీ సాహసమే చేశారని తెలుస్తోంది.
ఈ ఏడాది వేసవిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ క్లైమాక్స్ ఫైట్‌ను రీసెంట్గా ముంబైలో షూట్ చేశారు. దీని కోసం భారీ సెట్‌ను రూపొందించారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.7.5 కోట్లు ఖర్చు చేశారని టాలీవుడ్ టాక్. ప్రముఖ ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ నేతృత్వంలో 12 రోజుల పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్ల మధ్య ఈ ఫైట్‌ను రూపొందించారు. సినిమా క్లైమాక్స్ సీన్ కోసం ఇంత భారీగా ఖర్చు చేయడం ఇటు హీరో రామ్‌తో పాటు అటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిసింది. సాధారణంగా పూరి తన సినిమాలను తక్కువ బడ్జెట్లో, తక్కువ టైమ్‌లో, క్వాలిటీ ఔట్పుట్తో తీస్తుంటారు. పక్కా ప్లానింగ్‌తో సమయాన్ని వృథా చేయకుండా అనుకున్న బడ్జెట్లోనే మంచి ఔట్పుట్ ఇస్తుంటారాయన. కానీ విలన్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ ఉండటంతో క్రేజ్‌కు తగ్గట్లుగానే ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చు పెట్టారని వినికిడి. అయితే క్లైమాక్స్ కోసం ఇంత భారీగా ఖర్చు పెట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. పూరి ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే ఔట్పుట్ కూడా నెక్స్ట్ లెవల్లోనే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, ‘డబుల్ ఇస్మార్ట్’కు కూడా ఫస్ట్ పార్ట్‌కు మ్యూజిక్ అందించిన మణిశర్మే స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే 3 పాటు ఇచ్చేశారట. మరో రెండు సాంగ్స్ ఇవ్వాల్సి ఉందని సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్-మణిశర్మ మధ్య మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన ఆ రెండు పాటల్ని కూడా తెరకెక్కిస్తారని టాక్. కాగా, ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 8వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఆడియో హక్కుల్ని పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. మరి.. రామ్-పూరి కలయికలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.