P Krishna
Sri Vidya Distributed Crores: సినీ గ్లామర్ ప్రపంచం ఎంతో అందంగా ఉంటుందని భావిస్తుంటారు.. ఒక్కసారి తెరపై కనిపిస్తే చాలు జీవితం ధన్యమైపోతుందని భావిస్తారు. కానీ సినీ గ్లామర్ ప్రపంచ వెనుక ఎన్నో కష్టాలు.. కన్నీటి కథలు ఉన్నాయి
Sri Vidya Distributed Crores: సినీ గ్లామర్ ప్రపంచం ఎంతో అందంగా ఉంటుందని భావిస్తుంటారు.. ఒక్కసారి తెరపై కనిపిస్తే చాలు జీవితం ధన్యమైపోతుందని భావిస్తారు. కానీ సినీ గ్లామర్ ప్రపంచ వెనుక ఎన్నో కష్టాలు.. కన్నీటి కథలు ఉన్నాయి
P Krishna
వెండితెరపై ఛాన్స్ రావడం అనేది ఏ జన్మలో చేసిన పుణ్యమో అంటారు. ప్రస్తుతం వెండి తెరపై చాలా మంది నట వారసులు, చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు హీరో హీయిన్లు కావడం, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్న విషయం తెలిసిందే. కొత్తవారు ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకోవడం అనేది టాలెంట్ మాత్రమే కాదు.. అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు. సినీ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ వచ్చిందంటే చాలు.. సెలబ్రెటీ హోదా లభిస్తుందని ఫీల్ అవుతుంటారు. అందరూ అనుకున్నట్లు సినిమా రంగం గ్లామర్ ప్రపంచమే కాదు.. అంతులేని కన్నీటి కథలు ఉన్నాయని కొంతమంది నటీనటుల జీవితాలు చూస్తుంటే అర్థమవుతుంది. అందం.. అభినయం ఆమె సొంతం.. స్టార్ హీరోలు ఆమె సరసన నటించాలని కోరుకునే వారు. కానీ విధి ఆమెను వెక్కిరించింది.. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు.. ఆమెకు వచ్చిన కష్టం ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ కమెడియన్ కృష్ణమూర్తి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎల్ వసంత కుమారి దంతపతులకు జన్మించింది శ్రీవిద్య. ఆమె పుట్టిన ఏడాదికి అనుకోకుండా కృష్ణమూర్తి అనారోగ్యంతో మంచానపడ్డారు. దీంతో నటనకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఆ కుటుంబం పోషణ మొత్తం వసంత కుమారిపైనే పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల శ్రీ విద్య తన 14వ ఏటనే ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. శివాజీ గణేషన్ హీరోగా నటించిన ‘తిరువరుచెల్వర్’ అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు లో శ్రీ విద్య నటించిన మొదటి చిత్రం పెదరాశి పెద్దమ్మ. చక్కటి ముఖ వచ్ఛస్సు, అభినయం, నాట్యం అన్నీ శ్రీ విద్య సొంతం. తెలుగు లో దాసరి నారాయణరావు ఆమెను ఎక్కువగా ప్రోత్సహించారు.
తమిళ ప్రముఖ దర్శకులు కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ మూవీలో రజినీకాంత్, కమల్ హాసన్ నటించారు. ఈ మూవీని తెలుగులో తూర్పూ పడమర పేరుతో రిమేక్ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. రెండు భాషల్లో హీరోయిన్ గా శ్రీ విద్య నటించి మెప్పించింది. అప్పట్లో శ్రీవిద్య, కమల్ జంటగా ఎన్నో సినిమాలు వచ్చాయి..రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. 1978 లో మాలీవుడ్ దర్శకుడు జార్జ్ థామస్ ని పెళ్లి చేసుకుంది శ్రీ విద్య. పెళ్లైన తర్వాత భర్త కోరిక మేరకు ఇండస్ట్రీకి దూరమైంది శ్రీ విద్య. రెండు సంవత్సరాల తర్వాత ఆర్థిక కష్టాలు రావడంతో మళ్లీ సినిమాల్లో నటించి సంపాదించడం మొదలు పెట్టింది. ఆమె సంపాదిస్తుంటే భర్త జార్జ్ ఖర్చులు చేసే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు రావడతంో 1980 లో అతని నుంచి విడాకులు తీసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. 2003 లో శ్రీ విద్య అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు రొమ్ము క్యాన్సర్ రావడంతో తాను ఎంతో కాలం బ్రతకనని అర్థమైపోయింది. ఈ క్రమంలోనే తన పేరుపై ఎలాంటి ఆస్తి ఉండకూడదు అని నిర్ణయం తీసుకుంది. సంగీత, నృత్య కళాశాలల్లో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందడం లేదని ఆమెకు తెలిసిందే. వెంటనే నటుడు గణేష్ సహాయంతో ఒక ట్రస్ట్ ని రిజిస్ట్రర్ చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా అర్హులైన వారికి సహాయం అందేలా ఏర్పాటు చేశారు. ఆ రోజ్లోనే శ్రీ విద్యకు కోట్ల ఆస్తులు ఉన్నాయి.. వాటన్నింటిని ఆపదలో ఉన్నవారి సాయం అందించడం.. ట్రస్ట్ ద్వారా విద్యార్థులను ఆదుకోవడం చేశారు. మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్ తో పోరాడిన ఆమె 2006 అక్టోబర్ 19 న తన 53 వ ఏటా కన్నుమూశారు. ఆమె మరణంపై సినీ ఇండస్ట్రీనే కాదు.. విద్యార్థి లోకం శోక సంద్రంలో మునిగిపోయింది.