రూ.50 లక్షలు విరాళం.. గొప్ప ఉదారత చాటుకున్న హీరో శివకార్తికేయన్!

Sivakarthikeyan Donated Rs 50Lakh: తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తన పనితాను చేసుకుంటూ వెళ్తున్నారు కార్తీకేయన్.

Sivakarthikeyan Donated Rs 50Lakh: తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తన పనితాను చేసుకుంటూ వెళ్తున్నారు కార్తీకేయన్.

బుల్లితెరపై తమ సత్తా చాటి తర్వాత వెండితెరపై ఒక్క వెలుగు వెలిగిన వారిలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలేస్తున్న బాద్ షా షారూఖ్ ఖాన్ ‘సర్కాస్’ అనే సీరియల్ తో పాపులర్ అయి తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. నటుడు శివాజీ ఓ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత వెండితెరపై నటుడిగా తన సత్తా చాటారు. ఇక యాంకర్లు ఉదయభాను, ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి ఇలా ఎంతో మంది వెండితెరపై తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తమిళ నాట ప్రముఖ టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా పనిచేసి వెండితెరపై హీరోగా పాపులర్ అయ్యాడు శివకార్తికేయన్. తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నా ఈ హీరో. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్యకాలంలో కొంతమంది తమిళ హీరోలు తెలుగు లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో శివకార్తికేయన్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో ప్రముఖ విజయ్ టీవీ ఛానల్ లో యాంకర్ గా కొనసాగారు. ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ తో స్టూడియోల చుట్టూ తిరిగి మొత్తానికి దర్శకుడు పాండియరాజన్ మూవీ ‘మెరానా’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శివకార్తికేయన్ హీరోగానే కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని ఇండస్ట్రీలో టాక్. తాజాగా శివకార్తికేయన్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. ‘సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ భవన నిర్మాణం కోసం తన వంతుగా రూ. 50 లక్షలు అందించారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లెటర్ రాశారు.

ఇప్పటి వరకు ‘సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ భవన నిర్మాణం పలువురు నటీనటులు తమ వంతు సాయంగా విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ కు జనరల్ సెక్రటరీగా ఉన్న హీరో విశాల్ గత కొన్ని నెలలుగా విరాళాలు సేకరిస్తున్నారు. విశాల్ పిలుపు మేరకు తమిళ స్టార్ హీరోలు కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీ తో పాటు మరికొంతమంది హీరోలు తమ వంతు సాయం ప్రకటించారు. తాజాగా శివ కార్తీకేయన్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించడంతో ఆయన గొప్ప మనసుపై సినీ రంగానికి చెందిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం నడిగర్ సంఘానికి అధ్యక్షులుగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్ గా కార్తీ కొనసాగుతున్నారు.

Show comments