Nidhan
భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కొత్త కోచ్‌గా లెజెండరీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరును ఖాయం చేసినట్లు వినిపిస్తోంది. దీని వెనుక బోర్డు మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు సమాచారం.
భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కొత్త కోచ్‌గా లెజెండరీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరును ఖాయం చేసినట్లు వినిపిస్తోంది. దీని వెనుక బోర్డు మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు సమాచారం.
Nidhan
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం త్వరలో ముగిసిపోతుంది. జూన్ నెలతో ఆయనకు భారత క్రికెట్ బోర్డుతో ఉన్న కాంట్రాక్ట్ పూర్తవుతుంది. వన్డే వరల్డ్ కప్‌తోనే ఆయన పదవీకాలం ముగిసినా టీ20 ప్రపంచ కప్‌కు ఎక్కువ సమయం లేదు. దీంతో పొట్టి కప్పు పూర్తయ్యే వరకు హెడ్ కోచ్‌గా కంటిన్యూ అవ్వమని ద్రవిడ్‌ను రిక్వెస్ట్ చేసింది బీసీసీఐ. దీంతో అందుకు ఆయన ఒప్పుకున్నాడు. అయితే త్వరలో ఆ గడువు కూడా ముగిసిపోనుంది. దీంతో కొత్త కోచ్ కోసం అన్వేషిస్తోంది బీసీసీఐ. ఈ పదవికి అర్హులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సెక్రెటరీ జై షా ప్రకటించారు. అయితే పైకి అప్లై చేసుకోమని చెబుతున్నా.. ఆల్రెడీ కొత్త కోచ్ ఎవరనేది ఫిక్స్ అయ్యారని అంటున్నారు.
భారత జట్టు నయా కోచ్‌గా లెజెండరీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు కన్ఫర్మ్ అయ్యిందని వినిపిస్తోంది. ఈ రేసులో మరో ఇద్దరు దిగ్గజాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యువరాజ్ సింగ్‌తో పాటు ఆశిష్ నెహ్రాతో గంభీర్‌కు గట్టి పోటీ నడుస్తోందట. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఒకసారి ఛాంపియన్‌గా నిలబెట్టిన నెహ్రా.. ఇంకోసారి ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఈసారి మాత్రం అతడి కోచింగ్‌లో టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. మరోవైపు యువరాజ్ భారత క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌తో కూడా అతడికి సంబంధాలు లేవు. దీంతో వీళ్లిద్దరి కంటే గంభీర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని బోర్డు భావిస్తోందట.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్న గంభీర్ ఫుల్ సక్సెస్ అయ్యాడు. అతడి గైడెన్స్‌లో టీమ్ అద్భుతంగా ఆడుతోంది. క్రికెట్ కోసం రాజకీయాలకు కూడా బైబై చెప్పేశాడు గౌతీ. కోచింగ్‌లో అతడు చూపిస్తున్న దూకుడు, ఆటగాళ్లలోని టాలెంట్‌ను బయటకు తీసుకొస్తున్న విధానం, వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న తీరు, ప్రెజర్‌ను ఎలా తట్టుకోవాలో ప్లేయర్లకు నేర్పిస్తున్న పద్ధతికి బీసీసీఐ ఇంప్రెస్ అయ్యిందట. అందుకే అతడ్ని హెడ్ కోచ్‌గా నియమించాలని డిసైడ్ అయ్యిందట. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే గంభీర్‌కు కోచింగ్ పగ్గాలు అప్పగించనున్నారని క్రికెట్ వర్గాల సమాచారం. సౌతాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్-2027 వరకు అతడ్నే కోచ్‌గా కంటిన్యూ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్.. బీసీసీఐ ప్లానింగ్ అదుర్స్ అని అంటున్నారు. గంభీర్ కోచ్‌గా వస్తే అదిరిపోతుందని చెబుతున్నారు. మరి.. గంభీర్‌ను కోచ్‌గా నియమించనున్నారనే వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
The BCCI set to offer India’s New Head Coach a contract till the 2027 ODI World Cup in South Africa. pic.twitter.com/OI3UJB0KRX
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024