Nidhan
సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును సూపర్బ్ నాక్‌తో ఒడ్డున పడేశాడు.
సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును సూపర్బ్ నాక్‌తో ఒడ్డున పడేశాడు.
Nidhan
ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్‌లో భారీ స్కోర్లతో రఫ్ఫాడించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 250 ప్లస్ స్కోర్లను కూడా అవలీలగా బాదిపారేసింది. కానీ కీలకమైన ప్లేఆఫ్స్‌లో మాత్రం దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగింది ఎస్ఆర్హెచ్. అయితే 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 19.3 ఓవర్లకు 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఒకదశలో 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో టీమ్‌ను నిలబెట్టాడు ప్యాట్ కమిన్స్.
24 బంతుల్లో 2 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 30 పరుగులు చేశాడు కమిన్స్. స్టార్క్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ భీకరంగా బౌలింగ్ చేస్తున్నా తట్టుకొని నిలబడ్డాడు ఎస్ఆర్హెచ్ కెప్టెన్. రివర్స్ స్వీప్‌లు, ర్యాంప్ షాట్లతో పరుగులు రాబట్టాడు. ఆఖర్లో అతడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడకపోతే ఆరెంజ్ ఆర్మీ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. ఇవాళ బ్యాటింగ్‌లో హెడ్, షాబాజ్ డకౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ (3) కూడా నిరాశపర్చాడు. కాపాడతాడని అనుకున్న నితీష్ రెడ్డి (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. త్రిపాఠి (55), క్లాసెన్ (32) రాణించారు. అయితే రాంగ్ టైమ్‌లో వీళ్లిద్దరూ ఔట్ అవడంతో టీమ్ కష్టాల్లో పడింది. చివర్లో కమిన్స్ ఆదుకోకపోతే టీమ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అంత ఒత్తిడిలోనూ అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.
Pat Cummins 👏🏻👏🏻 pic.twitter.com/amBxEfsG2E
— RVCJ Media (@RVCJ_FB) May 21, 2024