మరో సంచలనం.. మొట్ట మొదటి AI సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ..

టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ ముచ్చటే వినిపిస్తుంది.

టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ ముచ్చటే వినిపిస్తుంది.

మనిషి టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కొత్త కొత్త పరికరాలను ఆవిష్కరిస్తున్నాడు. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ కి సంబందించిన చర్చలే నడుస్తున్నాయి. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉంది. మాన జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ కి సంబంధించి నాస్కామ్ నివేధిక ఓ వైపు ఆసక్తికరంగానూ.. మరోవైను ఆందోళనకు గురి చేస్తుంది. కృతిమ మేధ ప్రతి రంగంలోనూ అడుగు పెడుతుంది. సోషల్ మాధ్యమాల్లో ఇప్పుడు ఏఐ హవా నడుస్తుంది. యాంకర్ గా మారి వార్తలు చదవడం దగ్గర నుంచి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడం వరకు ఎన్నో రకాల పనులు చేస్తుంది. తాజాగా ఏఐ తో రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ఓ అద్భుతాన్ని సృష్టించింది. కాగ్నిషన్ అనే టెక్ కంపెనీ కృతిమ మేథ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ‘డెవిన్’ ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని రూపొందించడం ఎంతో గొప్ప ఆనుభూతి, ఆనందాన్ని ఇస్తుందని కంపెనీ అధికారిక సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేసింది. ఇది పలు కంపెనీల నుంచి ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసింది. ఒక ప్రాంప్ట్ మనం ఇస్తే చాలు అదే కోడింగ్ రాస్తుంది. ఇది వెబ్ సైట్లను కూడా క్రియేట్ చేస్తుంది.. సాఫ్ట్ వేర్ సృష్టిస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్తగా రూపొందించిన ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్లాన్స్ అమలు చేయగల సామర్ధ్యం ఉందని కంపెనీ వెల్లడించింది.

ఇది సొంత అనుభవాల నుంచి పాఠాలు తెలుసుకొని తన తప్పులను తనే సరిదిద్దుకోగల అద్భుత టెక్నాలజీ ఉంది. అంతేకాదు యూజర్ల ఫీడ్ బ్యాక్ తీసుకొని వారి అభిరుచుల మేరకు మెరుగైన సేవలు అందిస్తుంది. ఇది ప్రపంచంలో గొప్ప గేమ్ ఛేంజర్ కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏఐ కారణగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన పెరుగుతన్న ఈ సమయంలో ఇప్పుడు ఏకంగా ఏఐ సాఫ్ట్‌వేర్ రంగంలోకి దిగబోతుందన్న విషయం తెలిసి పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులను ఏఐ ఇంజనీర్లతో భర్తీ చేయడాలనే ఉద్దేశం తమకు లేదని. వారి పనులు సులభతరం చేయాలన్నదే తమ ఉద్దేశం అని కంపెనీ చెబుతుంది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments