Krishna Kowshik
విక్టర్ సైన్స్ టీచర్. స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. మంచిగా పాఠాలు చెబుతాడన్న పేరు ఉంది. అయితే వ్యక్తిగత కారణలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఓ రోజు బయటకు వెళుతున్నానని తల్లికి చెప్పి
విక్టర్ సైన్స్ టీచర్. స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. మంచిగా పాఠాలు చెబుతాడన్న పేరు ఉంది. అయితే వ్యక్తిగత కారణలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఓ రోజు బయటకు వెళుతున్నానని తల్లికి చెప్పి
Krishna Kowshik
ఆ ఊరిలో విక్టర్ అనే ఉపాధ్యాయుడికి మంచి పేరు ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. తల్లి ఫిర్యాదు చేయడంతో అతడి కోసం వెతకసాగారు పోలీసులు. ఈ కేసులో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అలాగే మొబైల్ కాల్స్ డేటా తీయగా.. అసలు విషయం వెలుగు చూసింది. 21 ఏళ్ల యువతితో అతడు తరచుగా సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడని. ఆమె పిలుస్తేనే బయటకు వెళ్లినట్లు వెల్లడైంది. చివరకు ఆమె ఈ హత్యలో హస్తం ఉన్నట్లు నిర్ధారించారు. అంతలో ఆమె వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఉపాధ్యాయుడ్ని తానే చంపానంటూ నిజం ఒప్పుకుంది. అతడ్ని ఎందుకు చంపిందో చెప్పేసరికి పోలీసులు విస్తుపోయారు.
ఉపాధ్యాయుడ్ని అతడి ప్రియురాలే హత్య చేయించిన ఘటన తమిళనాడులోని కడలూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరియలూరు జిల్లా అండిమడం ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల విక్టర్ కడలూరులోని తిరుపత్తిరిపులియూర్ కమ్మియంపేటలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అభిప్రాయ బేధాల కారణంగా భార్యతో విడిపోయి.. గత 8 సంవత్సరాల నుండి తల్లితో ఒంటరిగా కడలూరులో జీవిస్తున్నాడు. అయితే గత నెల 18న బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పిన విక్టర్.. ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తల్లి, బంధువులు, చుట్టాలు వెతికినా కానరాలేదు. మే 27న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, సెల్ ఫోన్ చివరిసారిగా కురించిపడి ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు.అప్పుడే వారికి జనని విషయం బయటకు వచ్చింది. ఆమెతో తరచూ ఫోనులో మాట్లాడుతున్నాడని వెల్లడైంది. ఆ క్రమంలో ఆమెను విచారించేందుకు సమయాత్తం అవుతున్న సమయంలో.. జనని, ఆమెకు సహకరించిన బంధువు దక్షిణామూర్తి పోలీసులు ఎదుట లొంగిపోయారు. తామే అతడ్ని హత్య చేసినట్లు నేరం అంగీకరించారు. వారిని విచారిస్తే.. విస్తుపోవడం పోలీసుల వంతైంది. జననితో విక్టర్ కు పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ క్రమంలో జననికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలిసి ఉపాధ్యాయుడు.. తనతో రొమాన్స్ చేసిన విషయాన్ని బయటకు చెబుతునంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. జనని భయపడి తన బంధువైన దక్షిణామూర్తికి చెప్పింది. ఈ ఇద్దరు కలిసి.. విక్టర్‌ను చంపడానికి ప్లాన్ వేశారు. ఈ క్రమంలో జనని.. ఉపాధ్యాయుడ్ని తన ఇంటికి పిలిపించింది. అక్కడకు రాగానే.. ఇనుప రాడ్‌తో రెడీగా ఉన్న దక్షిణామూర్తి.. అతడ్ని కొట్టి చంపి.. ఆపై గోనె సంచిలో కట్టి.. ముళ్లపొదలో పడేశారు. అక్కడకు వెళ్లి చూడగా.. అస్థిపంజరంలో అతడి మృతదేహం కనిపించింది పోలీసులు. దక్షిణామూర్తి, జనని అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.