పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వస్తోన్న ధరలు!

పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వస్తోన్న ధరలు!

కాలంతో పని లేకుండా మన దగ్గర బంగారానికి ఎప్పటికి భారీ డిమాండ్‌ ఉంటుంది. ఇక వివాహాది శుభకార్యల వేళ ఈ డిమాండ్‌ మరింత పెరుగుతుంది. ఇక గత కొన్నాళ్లుగా మన దగ్గర బంగారం ధర పైపైకి ఎగబాకుతుంది తప్ప దిగి రావడం లేదు. గోల్డ్‌ రేటు జీవిత కాల గరిష్టాలను తాకుతుంది. ఇక వెండి కూడా పుత్తడి బాటలోనే పయనిస్తోంది. జూలై నెలలోనే వెండి ధర ఎంత భారీగా పెరిగిందో చూస్తూనే ఉన్నాం. బంగారం ధర కూడా అదే దారిలో వెళ్తుంది. అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతూ.. కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది. ఇక వెండి ధర మాత్రం గత రెండు సెషన్లలో దిగి వచ్చింది. ఈ క్రమంలో మరి నేడు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. దిగి వచ్చాయా.. లేక స్థిరంగా కొనసాగుతున్నాయా అన్నది చూద్దాం..

గత రెండు సెషన్లలో దిగివచ్చిన బంగారం ధర ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 60,150 మార్క్ వద్ద ట్రేడువుతోంది. అలానే 22 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల రేటు నేడు స్థిరంగా కొనసాగుతూ.. రూ. 55,150 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేటు ఇదే పంథాలో నడిచింది. నేడు ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్‌ బంగారం ధర రూ. 55,300 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రేటు రూ. 60,320 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

రూ.500 తగ్గిన సిల్వర్‌ ధర..

వెండి కొనుగోలు చేయాలి భావిస్తున్న వారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ నెలలో రికార్డు స్థాయికి చేరిన వెండి కాస్త దిగివచ్చి ఉపశమనం కల్పించింది.నేడు సిల్వర్‌ రేటు పడిపోయింది. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో వెండి ధర కిలో మీద రూ. 500 పడిపోయింది. ప్రస్తుతం హస్తినలో కిలో సిల్వర్‌ రేటు రూ. 77,500 గ్రా టేడవుతోంది. ఇక మన హైదరాబాద్ మార్కెట్లో మాత్రం నేడు సిల్వర్‌ రేటు స్థిరంగా ఉంది. ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో వెండి రేటు రూ.80,500 మార్క్ వద్ద ట్రేడవుతోంది. నేడు ఢిల్లీలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. సిల్వర్‌ రేటు దిగి వచ్చింది. కానీ హైదరాబాద్‌లో మాత్రం సిల్వర్‌, గోల్డ్‌ రేట్లు స్థిరంగానే కొనసాగాయి.

Show comments