బంగారం కొనేవారు ఈ ఛాన్స్ మిస్ కావొద్దు.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: దేశంలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పసిడి కొనుగోలుదారులు ధరల విషయంలో కన్ఫ్యూజ్ కి గురి అవుతున్నారు.

Gold and Silver Rates: దేశంలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పసిడి కొనుగోలుదారులు ధరల విషయంలో కన్ఫ్యూజ్ కి గురి అవుతున్నారు.

ఇటీవల బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోతుంది. భారత దేశంలో పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు తప్పకుండా చేస్తుంటారు. ఈ క్రమంలోనే పసిడి డిమాండ్ పెరిగి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక మార్పుల ప్రభావం పసిడి, వెండి ధరలపై చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నెల ఒకటీ రెండు రోజుల తప్ప పసిడి ధరలు పెరిగిపోతూ వచ్చాయి. ఈ రోజు బంగారం కొనాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త. ప్రస్తుతం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఆషాఢమాసం మొదలైంది.. ఇక పండుగలు, వివాహాది శుభకార్యాలు మొదలవుతాయి. ఇక మహిళలతో జ్యులరీ షాపులు కిట కిటలాడుతాయి. బంగారం ధరలు పెరిగినా, తగ్గినా పసిడి డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పసిడి పై 5 వేల వరకు పెరిగిందని అంటున్నారు. ఈ నెల వరుసగా దిగి వచ్చిన పసిడి మళ్లీ పెరిగింది. ఈ రోజు పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరటనిచ్చే వార్త.. ఎందుకంటే ధరల్లో ఏ మార్పులు లేవు.నేడు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గి,రూ.67,090 చేరింది. అంతకు ముందు రూ.67,100గా ఉండేది.24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గి,రూ.73,190 చేరింది. అంతకు ముందు రూ.73,200గా ఉండేది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,240 ఉండగా. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,340లకు చేరింది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,090 ఉండగా. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,190 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,690లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 73,840 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 98,900 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, కోల్‎కత్తాలో కిలో వెండి రూ.95,200 ఉండగా, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.93,800 వద్ద కొనసాగుతుంది. చెన్నైలొ కిలో వెండి ధర రూ.98,900 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments