పసిడి ప్రియులకు ఊరట..ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: ప్రస్తుతం మార్కెట్‌లో పసిడికి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు.. అందుకే దీనికి ప్రపంచంలో డిమాండ్ ఎక్కువ.

Gold and Silver Rates: ప్రస్తుతం మార్కెట్‌లో పసిడికి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు.. అందుకే దీనికి ప్రపంచంలో డిమాండ్ ఎక్కువ.

భారత దేశంలో మహిళలు బంగారం అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు. పండుగలు, వివాహాది శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. పసిడి కి డిమాండ్ పెరగడంతో ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. గత ఏడాది తో పోల్చితే ఈ ఏడాది దాదాపు ఐదు వేలకు పైగా పెరిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో కీలక పరిణామాలు, వివిధ దేశాల్లో యుద్ద వాతావరణం ప్రభావం పసిడి, వెండిపై పడటంతో ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చని పసిడి స్వల్పంగా ఊరటనిచ్చింది.  ఈ రోజు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

పసిడి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. ఈ మధ్య కాలంలో మూడు సార్లు పెరిగిన పసిడి ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు పెరిగినప్పటికీ.. ఇక్కడ మాత్రం ఎలాంటి మార్పులు లేవు. కాకపోతే రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగేలా ఉన్నాయని.. సాధ్యమైనంత వరకు తగ్గినపుడు కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.20 తగ్గి, రూ.66,490 కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.20 పెరిగి, రూ.72,520కి చేరింది.తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 66,340 వద్ద కొనసాగుతుంది.24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,370 వద్ద ట్రెండ్ అవుతుంది.కిలో వెండి పై రూ.500 మేర పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,340 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,370 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,960 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,050 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక దేశ వ్యాప్తంగాత కిలో వెండి  రూ.500 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.96,100 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, కోల్‎కత్తాలో కిలో వెండి రూ.91,600 ఉండగా, చెన్నైలొ కిలో వెండి ధర రూ.96,100 వద్ద ట్రెండ్ అవుతుంది.

 

Show comments