Gold&Silver Rate On Dec 13th 2023: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. భారీగా పడిపోతున్న గోల్డ్ రేటు

Gold Rate: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. భారీగా పడిపోతున్న గోల్డ్ రేటు

బంగారం కొనాలనుకుని.. పెరుగుతున్న ధర చూసి భయపడుతున్న వారికి ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. గత రెండు రోజులుగా దిగి వస్తోన్న గోల్డ్ రేటు.. నేడు కూడా తగ్గింది. ఆ వివరాలు..

బంగారం కొనాలనుకుని.. పెరుగుతున్న ధర చూసి భయపడుతున్న వారికి ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. గత రెండు రోజులుగా దిగి వస్తోన్న గోల్డ్ రేటు.. నేడు కూడా తగ్గింది. ఆ వివరాలు..

బంగారం కొనాలనుకునే వారికి.. శుభవార్త అని చెప్పవచ్చు. గత మూడు రోజులుగా పసిడి ధర భారీగా పడిపోతూ వస్తోంది. దాంతో బంగారం కొనాలనుకునే వారు.. ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. అటు అంతర్జాతీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు దిగి రావడంతో.. దేశీయంగా కూడా ఆ ప్రభావం కనిపించింది. ఇక గత మూడు రోజులు వరుసగా బంగారం ధర దిగి వస్తోంది. ఈ మూడు రోజుల్లోనే పసిడి ధర 10 గ్రాముల మీద తులం ఏకంగా రూ.1000 కిపైగా దిగి వచ్చింది.  అలానే వెండి రేటు సైతం భారీగానే దిగి వస్తోంది. గత వారం రోజుల్లో కిలో వెండి రేటు ఏకంగా రూ.8500 మేర దిగివచ్చింది. నేడు కూడా అనగా బుధవారం నాడు గోల్డ్, సిల్వర్ రేట్లు.. దిగి వచ్చాయి. ఆ వివరాలు..

నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం రేటు పడిపోయింది. వరుసగా మూడో రోజు కూడా భాగ్యనగరంలో గోల్డ్ రేటు దిగి వచ్చింది. నేడు హైదరాబాద్ లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల గోల్డ్ ధర పది గ్రాముల మీద రూ.200 మేర దిగివచ్చి.. రూ. 56,750 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా దిగి వచ్చింది. నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్ గోల్డ్ ధర పది గ్రాముల మీద రూ. 220 మేర పడిపోయి రూ.61,910 వద్ద కొనసాగుతోంది.

ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా నేడు బంగారం ధర దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్ పసిడి పది గ్రాముల ధర తులం మీద రూ.150 మేర పడిపోయింది. ప్రస్తుతం దేశ రాజధానిలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల రేటు రూ. 56,900 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద రూ.220 మేర పడిపోయి రూ. 62,060 వద్ద అమ్ముడవుతోంది.

దిగి వచ్చిన వెండి ధర..

నేడు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత పది రోజులుగా సిల్వర్ రేటు దిగి వస్తోంది.  మొత్తంగా వెండి రేటు కిలో మీద గత 8 రోజుల్లో ఏకంగా రూ.8500 మేర పడిపోయింది. నేడు సిల్వర్ రేటు దిగి వచ్చింది. నేడు హైదరాబాద్ లో వెండి ధర కిలో మీద రూ.100 తగ్గి రూ. 77,700 వద్ద కి దిగి వచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో సిల్వర్ రేటు కిలో మీద రూ.100 తగ్గి రూ. 75,700 వద్ద ట్రేడవుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్ లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు దిగి వస్తున్నాయి. నేడు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1981 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Show comments