Gold&Silver Price Hike On 21st July 2023: పసిడి ప్రియులకు అలర్ట్‌.. అక్కడ తగ్గిన బంగారం ధర!

పసిడి ప్రియులకు అలర్ట్‌.. అక్కడ తగ్గిన బంగారం ధర!

బంగారం ధర చుక్కలను తాకుతుంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు పసిడి ధర గరిష్ట స్థాయికి చేరింది. జూన్‌ నెల మొత్తం దిగి వచ్చిన పసిడి ధర.. ఈనెలలో మాత్రం చుక్కలను తాకుతోంది. క్రితం సెషన్‌లో పసిడి రేటు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తూ గరిష్ట స్థాయికి చేరింది. దాంతో వెండి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే జనాలు భయపడుతున్నారు. మరో నెలలో శుభకార్యాలు ప్రారంభం అవుతాయి. దాంతో పుత్తడికి గిరాకీ పెరుగుతుంది. ఆ సమయంలో బంగారం రేటు మరింత పెరుగుతుంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా బంగారం రేటు తగ్గడం, పెరగడం ఉంటుంది. కానీ నేడు అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. నేడు మన గోల్డ్‌ రేటు ఎంత ఉంది అంటే..

నేడు అంతర్జాతీయంగా బంగారం ధర దిగివచ్చినప్పటికీ దేశీయ బులిన్‌ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర పరుగులు తీసింది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 100 మేర పెరిగి రూ. 55,700లకు చేరింది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాముల మీద రూ. 100 పెరిగి ప్రస్తుతం రూ. 60,750 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. నేడు హస్తినలో చూసుకుంటే 22 క్యారెట్‌ బంగారం రేటు పది గ్రాముల మీద రూ. 100 పెరిగి రూ. 55,850 వద్దకు చేరింది. అలానే 42 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 100 పెరిగి రూ. 60,900 వద్ద ట్రేడవుతోంది.

ఇక నేడు వెండి ధర బంగారం బాటలోనే పయనిస్తోంది. సిల్వర్‌ రేటు భారీగా పెరుగతోంది. నేడు హైదరాబాద్‌లో వెండి ధర కిలోపై రూ. 400 పెరిందిగి. దాంతో భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ.82,400వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధర పెరిగినప్పటికీ సిల్వర్‌ రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. నేడు హస్తినలో కిలో వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. కానీ గత మూడు రోజుల్లో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 900 మేర పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి రూ.78,400 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, బంగారం మాత్రం తక్కువకే లభిస్తుంది. ఇందుకు ఆ ప్రాంతాల్లోని ట్యాక్స్‌లే కారణం అవుతాయి.

ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ ధర పెరిగితే.. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర దిగి వచ్చింది. నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు క్రితం సెషన్‌తో పోలిస్తే ఇవాళ పడిపోయింది. ఒక ఔన్సుకు దాదాపు 10 డాలర్ల మేర దిగివచ్చింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ బులియన్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సు ధర 1973.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు అది 1984 డాలర్ల పైన ట్రేడయ్యింది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 24.86 డాలర్లపైన ట్రేడవుతోంది.

Show comments