పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన వెండి, బంగారం ధరలు!

పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన వెండి, బంగారం ధరలు!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గడం తెలియదు అన్నట్లు ఉన్న పసిడి రేటు ఈ వారం ప్రారంభం నుంచి దిగి వస్తోన్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పసిడి ధర స్వల్పంగా అయినా దిగి రావడం లేదా స్థిరంగా ఉండటం జరుగుతోంది. ఇక వెండి ధర అయితే భారీగా దిగి వస్తోంది. నేడు కూడా ఇదే పంథా కొనసాగింది. బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. కనుక గోల్డ్‌, సిల్వర్‌ కొనాలనుకునేవారు.. ఇప్పుడే కొంటే మంచిదని.. భవిష్యత్తులో వీటి ధర భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. మరి నేడు బంగారం, వెండి ధర ఎంత దిగి వచ్చింది.. దేశ, రాష్ట్ర రాజధానిలలో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. పది గ్రాముల మీద 160 రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద 160 రూపాయలు తగ్గి.. 60వేల రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలానే ఆభరణాల తయారికి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ.160 తగ్గి.. 55 వేల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలానే ఢిల్లీలో కూడా బంగారం ధర నేడు స్వల్పంగా దిగి వచ్చింది. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. ఢిల్లీలో 22 క్యారెట్‌ పది గ్రాముల బంగారం ధర రూ.55,000 లు ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.60,000 లుగా ఉంది.

నేడు వెండి ధర బంగారం బాటలోనే పయనించింది. బుధవారం నాడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.500 మేర తగ్గింది. ఈ క్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000లుగా ఉంది. ఇక భాగ్యనగరంలో కూడా వెండి ధర దిగి వచ్చింది. కిలో సిల్వర్‌ మీద రూ. 500 తగ్గి.. 80 వేల వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీతో పోల్చుకుంటే.. హైదరాబాద్‌లో వెండి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులు దీనికి ప్రధాన కారణం.

Show comments