T-Shirt: టీ షర్టులో ‘T’ అంటే ఏంటో తెలుసా.? చరిత్ర పెద్దదేనండోయ్..!

టీ షర్టులో ‘T’ అంటే ఏంటో తెలుసా.? చరిత్ర పెద్దదేనండోయ్..!

ఏరా ఇంట్లో ఇన్ని షర్టులు ఉన్నా.. ఆ దిక్కుమాలిన టీ షర్టు వేసుకుంటావురా అని నాన్న అరిచినా, ఏంటీ ఈ ప్యాషన్.. ఫంక్షన్ కు వెళుతున్నాం.. మంచిగా మొన్న కొన్నే ఆ కొత్త దుస్తులు ఉన్నాయిగా అవి వేసుకోమ్మా అని అమ్మ చెప్పినా సరే.. టీ షర్టులే ధరించేవాళ్లు ఎక్కువ. మరీ ఆ టీ షర్టు వెనుక ఈ కథ మీకు తెలుసా..?

ఏరా ఇంట్లో ఇన్ని షర్టులు ఉన్నా.. ఆ దిక్కుమాలిన టీ షర్టు వేసుకుంటావురా అని నాన్న అరిచినా, ఏంటీ ఈ ప్యాషన్.. ఫంక్షన్ కు వెళుతున్నాం.. మంచిగా మొన్న కొన్నే ఆ కొత్త దుస్తులు ఉన్నాయిగా అవి వేసుకోమ్మా అని అమ్మ చెప్పినా సరే.. టీ షర్టులే ధరించేవాళ్లు ఎక్కువ. మరీ ఆ టీ షర్టు వెనుక ఈ కథ మీకు తెలుసా..?

చిన్నపిల్లలైనా, కాలేజీ చదివే కుర్రకారైనా, ఉద్యోగాలకు వెళ్లే యువతైనా, పదవీ విరమణ చెందిన తాతలైనా కంఫర్ట్‌గా ధరించే ఏకైక డ్రెస్ ఏదైనా ఉంది అంటే అదీ టీ షర్టే. అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాల నుండి వచ్చిన ఈ టీ షర్టు మన సంప్రదాయ వస్త్రంగా మారిపోయింది. ఎండాకాలం, వర్షకాలం, చలికాలంతో.. ఏ కాలమైనా సరే కన్వినెంట్‌గా ఉంటుంది ఈ టీ షర్ట్. అమ్మాయిలు షాపింగ్‌కు వెళితే.. ముందుగా చీరలు, యాక్సరీస్ వస్తువులను చూసినట్లు.. అబ్బాయిలు, పురుషుల కళ్లన్నీ ముందు టీ షర్టులపైనే పడతాయి. వాటినే కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ టీ షర్టులను అమ్మాయిలు కూడా బాగా వినియోగిస్తున్నారు.

ధరించేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైలిష్ లుక్స్‌లో కనిపించడం వల్ల ఈ దుస్తులను ప్రిఫర్ చేస్తున్నారు. ఇదంతా చెప్పుకుంటున్నాం కానీ టీ షర్టులో ఆ టీ అనే పదం ఏంటో తెలుసుకున్నారా..? తెలియదు కదా.. దీనికి ఓ పెద్ద కథాకమామీషు, చరిత్ర ఉందండోయ్. ఇంతకు ఆ టీ అనే పదం రావడం వెనుక రెండు కథలు ఉన్నాయి. అవేటంటే.. ఒకసారి మీ టీ షర్టును గమనించి చూడండి. అది టీ ఆకారంలో ఉంటుంది కాబట్టి.. దానికి టీ షర్ట్ అనే పేరు వచ్చిందని ప్రాచుర్యంలో ఉంది. ఇక మరో కథ ఏంటంటే.. చరిత్రలో లిఖించబడి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా సైనికులు శిక్షణ సమయంలో కంఫర్ట్ గా ఉండేందుకు వెరైటీగా రూపొందించిన షర్టులను వినియోగించేవారు.

అంటే శిక్షణా సమయంలో ఎక్కువగా ఈ దుస్తులు ధరించేవారట. అందుకే వీటికి టీ (ట్రైనింగ్) షర్ట్ అనే పేరు వచ్చిందని వినికిడి. యుద్దం ముగిశాక.. ఎక్కువగా వీటినే ధరించేవారట సైనికులు. దీంతో టీ షర్టులు అప్పటి నుండి బాగా వాడుకలో వచ్చేశాయి. వీటి వినియోగం పెరిగాక.. ఇక రకరకాలుగా టీషర్టులను తయారు చేసి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చేవి పలు వస్త్రదుకాణ సంస్థలు. తొలుత కేవలం తెలుపు రంగులోనే ఉండవి. కానీ కాలక్రమేణ రకరకాల రంగులతో పాటు,డిజైన్స్, ప్యాషన్లలో లభించడం మొదలు పెట్టాయి. ఇప్పుడు కంపెనీ లోగోలు, కొటేషన్లతో కూడిన టీ షర్టులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. టీ షర్టు వెనుక ఇంత కథ ఉందని తెలిసింది కదా.. మీ అభిప్రాయమేమిటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments