CM Jagan-YSR Nethanna Nestham 2023 Funds: ఇప్పటి వరకు వారికి రూ.1,20,000 జమ చేశాం: సీఎం జగన్‌

ఇప్పటి వరకు వారికి రూ.1,20,000 జమ చేశాం: సీఎం జగన్‌

వినూత్న సంక్షేమ పథకాలతో బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం కృషి చేప్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అన్ని సామాజిక వర్గాల వారు అభివృద్ధి చెందడం కోసం అనేక రకాల నగదు బదిలీ కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా మగ్గానికి మహర్దశ తీసుకొచ్చేందుకు.. దేశంలో ఎక్కడా లేని విధంగా నగదు బదిలీ కార్యక్రమం తీసుకువచ్చి.. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగన్‌ ప్రభుత్వం. వారిని ఆదుకోవడ కోసం నేతన్న నేస్తం పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రతి ఏటా నేతన్నలకు ఏటా 24 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిపిందే.

దానిలో భాగాంగా ఈ ఏడాది నేతన్నకు ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తిరుపతి వెంకటగిరిలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మొదట రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. ఆ తర్వాత అక్కడి నుంచి వెంకటగిరి చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ. 193.64 కోట్లను తిరుపతి వెంకటగిరిలో నేడు బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్‌. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైఎస్సార్‌ నేతన్న హస్తం ద్వారా రూ.967.77 కోట్లు అందించారు. ఇదిగాక.. నేతన్నల పెన్షన్‌ కోసం రూ. 1.396 కోట్లు, ఆప్కోకు మరో రూ.468.84 కోట్లు.. మొత్తం ఇప్పటివరకు ఈ మూడింటి ద్వారా రూ. 2,835.06 కోట్లు అందించింది జగన్‌ సర్కార్‌. వైఎస్సార్‌నేతన్న నేస్తం ద్వారా ఇప్పటిదాకా జగన్‌ ప్రభుత్వం ప్రతీ నేతన్నకు అందించిన మొత్తం సాయం ఇవాళ్టి దాంతో కలిపి రూ.1, 20,000 అనగా ఐదేళ్ల కాలానికి సంబందించి పూర్తి సాయం అందిచారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫోస్ట్‌ను చెత్త బుట్టలో పడేశారు. నేతన్నలకు ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. నాలుగేళ్లలో లబ్దిదారుల ఖాతాల్లోకి రూ. 2 లక్షల 25వేల కోట్లు జమ చేశాం.నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్‌.. వలంటీర్ల క్యారెక్టర్‌ గురించి మాట్లాడతున్నాడు. వలంటీర్లందరూ సేవాభావంతో పనిచేస్తున్నారు. విలువలు లేని వాళ్లంతా మన సేవామిత్ర, సేవా రత్నం, సేవా వజ్రాలను తప్పుబడుతున్నారు. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్ పవన్‌ కళ్యాణ్‌‌. అలాంటి క్యారెక్టర్‌ లేని వాళ్లంతా వలంటీర్ల గురించి మాట్లాడతారా అంటూ సీఎం జగన్‌ మండి పడ్డారు.

Show comments