AP గురుకుల పాఠశాల ప్రవేశాలకు ఆహ్వానం.. ఉచితంగా కార్పోరేట్ స్థాయి విద్య!

ఆంధ్రప్రదేశ్ గురుకల విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం వెలువడింది.

ఆంధ్రప్రదేశ్ గురుకల విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం వెలువడింది.

విద్యా, వైద్య, బ్యాకింగ్ రంగాలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎడ్యూకేషన్ కి సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏపీ మోడల్ స్కూల్స్ కి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అలానే తాజాగా గురుకల విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ గురుకల విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశం, 6,7,8 తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ గుంటూరు జిల్లా కన్వీనర్ జె. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 5వ తరగతి విద్యార్థులు 6వ తరగతిలోకి ప్రవేశించేందుకు, అలానే 6,7,8 తరగతుల్లో ఖాళీ అయిన సీట్ల భర్తీకి ఈ  నోటిఫికేషన్ విడుదలైంది.

5వ తరగతి విద్యార్థులు గురుకల విద్యాలయాల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి https://aprs.apcfss.in/aprfifth-index పై క్లిక్ చేయండి. అలాగే 6,7,8 తరగతుల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి కూడా పై లింక్ నే క్లిక్ చేయండి. మొత్తంగా గురుకుల పాఠశాల ప్రవేశాల కోసం విద్యార్థులు పూర్తి వివరాలను https://aprs.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇక గురుకుల పాఠశాల  దరఖాస్తుకు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.  అలానే అప్లయ్ చేసేందు మార్చి 31 చివరితేదిగా ఉంది.

గుంటూరులో ఉన్న ఏపీఆర్ఎస్ మైనారిటీ బాలుర పాఠశాలలో వచ్చే  అకాడమిక్ ఇయర్ కి, కోస్తా ప్రాంతాలలో ఉన్న 9 జిల్లాల మైనారిటీలు మే 1 తేదీ నుంచి ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా అడ్మిషన్స్ పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ గుంటూరు జిల్లా కన్వీనర్ జె. శ్రీనివాసరావు కీలక విషయాలను తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ద్వారా ఆంగ్ల భోదన, ఐఎఫ్పీ, బైజుస్ యాప్ (డిజిటల్) బోధన, ఉచిత వసతి సదుపాయం, క్రీడలు, వ్యాయామానికి ప్రాదాన్యాత ఉంటుంది అని పేర్కొన్నారు. సందేహాలు, వివరాల కొరకు నేరుగా పాఠశాలని గాని లేదా 9849693011, 9399977561, 7330217674, 9912638805 నెంబర్లకి గానీ ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు.

గమనిక : 6, 7, 8 తరగతుల్లో మిగిలివున్న ఖాళీలకు సంబంధించి ప్రవేశ పరీక్షకు అప్లయ్ చేసే అభ్యర్ధులు ముందుగా ప్రాస్పెక్టస్ లో చూపిన విధంగా సంబంధిత పాఠశాల, అలానే సంబంధిత తరగతి, కేటగిరీలలో ఖాళీలు వున్నాయా? లేదా అని నిర్ధారించుకొవాలి. ఆ తరువాత మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించవలెను.

Show comments