వాతావరణ శాఖ అలర్ట్‌.. నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే సెప్టెంబర్‌ నెల మొదలైన నాటి నుంచి వర్షాలు విజృంభిస్తున్నాయి. ఆగస్టు నెలలో అంటీముట్టనట్లు వ్యవహరించిన వర్షాలు.. ఈ నెల మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. మొన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌ నగరం అయితే చిగురుటాకులా వణికి పోయింది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఏపీ, తెలంగాణాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.

నిన్న రాత్రి కూడా భారీ వర్షం పడింది. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. గత  3 రోజులుగా బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లో భూమిపైనే తుపాను లాంటి వాతావరణం ఏర్పడింది. అక్కడ దట్టమైన మేఘాలు సుడిలాగా తిరుగుతున్నాయి. వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాలు దాటి లక్షద్వీప్ వరకు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

దీని కారణంగా ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనడినా.. దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటూ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. మరి, నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments