రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు పాక్‌ క్రికెటర్లు! పరిస్థితి ఎలా ఉందంటే?

రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు పాక్‌ క్రికెటర్లు! పరిస్థితి ఎలా ఉందంటే?

Bismah Maroof, Ghulam Fatima: పాకిస్థాన్‌ ఉమెన్‌ స్టార్‌ క్రికెటర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పాకిస్థాన్‌ జాతీయ జట్టులో ఎంతో కీలకమైన వీరిద్దరు రోడ్డు ప్రమాదానికి గురి అవ్వడంతో పాక్‌ క్రికెట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

క్రికెట్‌ ప్రపంచం ఉలిక్కిపడే ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాకిస్థాన్‌ ఉమెన్‌ క్రికెటర్లు శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ బిస్మా మరూఫ్, లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా క్రికెటర్లకు గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వెంటనే వాళ్లకి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం వాళ్లిద్దరు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షణలో ఉన్నట్లు పీసీబీ ప్రకటించింది.

ప్రమాదం తరువాత మరూఫ్, ఫాతిమాకు తక్షణ ప్రథమ చికిత్స అందించనట్లు పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వారికి కావాల్సిన పూర్తి వైద్యసేవలను అందిస్తామని కూడా పాక్‌ బోర్డు ప్రకటించింది. బిస్మా మరూఫ్, గులాం ఫాతిమా ఇద్దరూ పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌ కోసం ఈ ఇద్దరు ప్రస్తుతం శిక్షణా శిబిరానికి హాజరయ్యే సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రమాదానాకి గురయ్యారు. ఏప్రిల్ 18 నుంచి వెస్టిండీస్‌-పాకిస్థాన్‌ మధ్య సిరీస్‌ ప్రారంభం కానుంది. మరి ఈ సిరీస్‌కు ఈ ఇద్దరు క్రికెటర్లు అందుబాటులో ఉంటారా లేదా అన్నది వారు కోలుకున్నాకా.. మెడికల్‌ టీమ్‌ నిర్ణయించనుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments