Big Relief: ఈ క్రెడిట్ కార్డులు వాడేవారికి గుడ్ న్యూస్.. పూర్తి పేమెంట్ చేయక్కర్లేదు..

ఈ క్రెడిట్ కార్డులు వాడేవారికి గుడ్ న్యూస్.. పూర్తి పేమెంట్ చేయక్కర్లేదు..

Big Relief: క్రెడిట్ కార్డులు వాడేవారు ఎవరైనా సరే బిల్ ఎంత జనరేట్ అయితే అంతా కట్టాల్సిందే. మినిమమ్ డ్యూ కట్టినా గానీ ఇది వడ్డీ కింద జమ చేసుకుంటారు కాబట్టి ఆ తర్వాత అయినా ఫుల్ అమౌంట్ పే చేయకతప్పదు. అయితే ఈ క్రెడిట్ కార్డులు వాడేవారు మాత్రం జనరేట్ అయిన బిల్ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు.

Big Relief: క్రెడిట్ కార్డులు వాడేవారు ఎవరైనా సరే బిల్ ఎంత జనరేట్ అయితే అంతా కట్టాల్సిందే. మినిమమ్ డ్యూ కట్టినా గానీ ఇది వడ్డీ కింద జమ చేసుకుంటారు కాబట్టి ఆ తర్వాత అయినా ఫుల్ అమౌంట్ పే చేయకతప్పదు. అయితే ఈ క్రెడిట్ కార్డులు వాడేవారు మాత్రం జనరేట్ అయిన బిల్ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు.

క్రెడిట్ కార్డులు వాడేవారికి రివార్డ్ పాయింట్స్ గురించి తెలిసే ఉంటుంది. స్వైపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డులో కొన్ని రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. షాపింగ్ చేసినా, పెట్రోల్ కొట్టించుకున్నా ఇలా క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపినప్పుడు రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతా ఉంటాయి. వీటిని క్యాష్ గానో, వౌచర్స్ గానో కన్వర్ట్ చేసుకుని వాటితో ఏమైనా వస్తువులు కొనుక్కుంటారు. చాలా బ్యాంకులు రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ గా కన్వర్ట్ చేసుకునే వీలు లేకుండా ఆ పాయింట్స్ తో వాళ్ళు చూపించిన వస్తువులు మాత్రమే కొనుక్కునేలా చేస్తున్నారు. దీని వల్ల క్రెడిట్ కార్డ్ యూజర్స్ కి పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. దీనికి తోడు కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్స్ విలువని, క్యాష్ బ్యాక్ పాయింట్స్ ని తగ్గించేశాయి.

ఈ క్రమంలో దేశీయ దిగ్గజ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో క్రెడిట్ కార్డు యూజర్స్ కి ప్రయోజనం చేకూరనుంది. బిల్ పేమెంట్ ఎంత ఉంటే అంతా కట్టాల్సిన పని లేదు. క్యాష్ బ్యాక్ నేరుగా క్రెడిట్ కార్డు ఖాతాలో జమ అవ్వడం వల్ల కార్డు పేమెంట్ భారం తగ్గుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ తేదీ ప్రతి నెలా 21న జనరేట్ అవుతుంది అనుకుంటే.. అంతకు ముందు నెలలో వచ్చిన క్యాష్ బ్యాక్ స్టేట్మెంట్ లో చూపిస్తుంది. దీని వల్ల మీరు చెల్లించాల్సిన బిల్లులో క్యాష్ బ్యాక్ తగ్గి మిగిలిన అమౌంట్ మాత్రమే స్టేట్మెంట్ లో కనబడుతుంది. అంటే క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాష్ బ్యాక్ ఎంతైతే వచ్చిందో అది పోగా మిగిలిన అమౌంట్ చెల్లిస్తే చాలు.

ఇప్పుడు వచ్చే క్యాష్ బ్యాక్ తదుపరి నెలలో వచ్చే స్టేట్మెంట్ బ్యాలెన్స్ ని తగ్గిస్తుంది. క్రెడిట్ కార్డుపై వచ్చే క్యాష్ బ్యాక్ అనేది ఇప్పుడు సానుకూలంగా మారనుంది. అయితే ఇది కేవలం స్విగ్గీ హెచ్డీఎఫ్సీ కార్డు వినియోగించేవారికి మాత్రమే. ఈ క్రెడిట్ కార్డులు వాడేవారు మాత్రమే క్యాష్ బ్యాక్ ని వినియోగించుకుని బిల్లు భారం తగ్గించుకునే వీలుంది. వివిధ లావాదేవీల ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ అనేది స్విగ్గీ యాప్ లోని స్విగ్గీ మనీలో కనిపిస్తుంది. అయితే జూన్ 21వ తేదీ నుంచి మాత్రం క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ లో ఈ క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అవుతుంది. దీని వల్ల క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ లో జనరేట్ అయిన బిల్లు భారం అనేది తగ్గుతుంది. క్యాష్ బ్యాక్ అమౌంట్ మినహాయించి మిగతా అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది.

క్రెడిట్ కార్డు యూజర్ల ఆర్థిక విషయాలను సులభంగా ట్రాక్ చేయడంలో.. అలానే క్యాష్ బ్యాక్ ని మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడేందుకు ఈ మార్పులను తీసుకొచ్చామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. అయితే జూన్ 20 వరకూ వచ్చే క్యాష్ బ్యాక్ స్విగ్గీ యాప్ లోని స్విగ్గీ మనీ వాలెట్ లోనే కనిపిస్తుందని అన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డు యూజర్లకు ప్రయోజనం చేకూరుతుందని, క్యాష్ బ్యాక్ తో బిల్లు భారం తగ్గించుకోవచ్చునని అన్నారు. ‘వుయ్ అండర్ స్టాండ్ యువర్ వరల్డ్’ ట్యాగ్ లైన్ కి తగ్గట్టే హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్స్ కోసం ఆలోచిస్తుంది.

Show comments