Save The Tigers Season 2 Review & Rating: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రివ్యూ

Save The Tigers Season 2 Review: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రివ్యూ

Save The Tigers Season 2 Review & Rating In Telugu: గతేడాది వచ్చిన సేవ్ ది టైగర్స్ మగాళ్ల కష్టాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది. మరి.. ఈ సీజన్ 2లో ఎవరి కష్టాలను అడ్రస్ చేశారు? మగజాతి ఆణిముత్యాలు ఏం చేస్తున్నారు? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

Save The Tigers Season 2 Review & Rating In Telugu: గతేడాది వచ్చిన సేవ్ ది టైగర్స్ మగాళ్ల కష్టాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది. మరి.. ఈ సీజన్ 2లో ఎవరి కష్టాలను అడ్రస్ చేశారు? మగజాతి ఆణిముత్యాలు ఏం చేస్తున్నారు? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

ఓటీటీలో కావాల్సినన్ని యాక్షన్, లవ్, థ్రిల్లర్ వెబ్ సిరీస్లు ఉన్నాయి. కానీ, సరైన కామెడీ వెబ్ సిరిసీ లేదని ఆడియన్స్ బాధ పడుతున్న సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గతేడాది సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ రిలీజైంది. ఆ సిరీస్ కి ఓటీటీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. సీజన్ 1 చూసిన తర్వాత నుంచి సీజన్ 2 కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఆ రోజు రానే వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రెండో సీజన్ 2 మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి.. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

కథ:

మొదటి సీజన్ హీరోయిన్ హంస లేఖ(సీరత్ కపూర్) మిస్ కావడంతో కథ ముగుస్తుంది. రెండో సీజన్ ను అదే పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు. హంసలేఖ ఎక్కడ? అంటూ అందరూ హైరానా పడిపోతూ ఉంటారు. మరోవైపు పోలీసులేమో విక్రమ్(చైతన్య కృష్ణ), రాహుల్(అభినవ్), గంటా రవి(ప్రియదర్శి)లకు పోలీస్ స్టైల్ లో కోటింగ్ ఇస్తూ ఉంటారు. మరోవైపు ఈ ముగ్గురు భర్తలు మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతారు. హంసలేఖను ఆ ముగ్గురు తీసుకెళ్లే వీడియో క్లిప్ ప్రసారం చేస్తారు. కొందరైతే ఆ ముగ్గురే హంసలేఖను చంపేశారు అంటూ వార్తలు వైరల్ చేస్తారు. తీరా హంసలేఖ రీ ఎంట్రీ ఇవ్వడంతో విక్రమ్, రాహుల్, గంటా రవిలను వదిలేస్తారు. అయితే ఈ ముగ్గురు దంపతుల మధ్య మళ్లీ ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి? అసలు వీళ్లు కౌన్సిలర్ దగ్గరకి ఎందుకు వెళ్లారు? గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలనే గంటా రవి భార్య కోరిక తీరిందా లేదా? అనేది తెలియాలంటే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 చూడాల్సిందే.

విశ్లేషణ:

సేవ్ ది టైగర్స్ అనగానే అందరికీ మొదట కామెడీనే గుర్తొస్తుంది. ఈ సిరీస్ లో కూడా మేకర్స్ ఆ పాయింట్ ని ఎక్కడా తగ్గించలేదు, ఎక్కడా మిస్ చేయలేదు. దానికి అదనంగా ఒక మేసేజ్ ని కూడా అందించారు. ప్రస్తుతం సమాజంలో ఎంతో మంది దంపతులు ఈ సిరీస్ కి రిలేట్ అవుతారు. ఎందుకంటే దాదాపుగా అందరి ఇళ్లల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక్కో వ్యక్తి తమని ఒక్కో పాయింట్ దగ్గర రిలేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఈ సిరీస్ కనెక్ట్ అవుతుంది. భార్యాభర్తలు, తండ్రీకూతుళ్లు, తల్లీ కొడుకులు ఇలా ప్రతి బంధాన్ని ఈ సిరీస్ లో హైలెట్ చేశారు. ముఖ్యంగా కళ్లకు కనిపించే ప్రతి విషయం నిజం కాదు అనే సందేశాన్ని ఇచ్చారు. మీరు స్వయంగా చూసిన విషయం కూడా మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. ఒక విషయాన్ని చూడగానే ఫైనల్ జడ్జిమెంట్ కి, అభిప్రాయానికి రాకూడదు అంటూ ఈ సిరీస్ లో క్లియర్ గా చెప్పారు. అలాగే దంపతులు ఎలా ఉండాలి? ఎలా ఉంటే గొడవలు అవుతాయి? ఎలా ఉంటే ఆనందంగా ఉంటారు అనే విషయాలను వెల్లడించారు.

ఎవరెలా చేశారు- టెక్నికల్ టీమ్:

ఈ సిరీస్ మొత్తానికి ఆ ముగ్గురు దంపతులు బిగ్ అసెట్ అని చెప్పాలి. చైతన్య కృష్ణ, అభినవ్ గుమ్మటం, ప్రియదర్శి, దేవయాని, సుజాత, పావని ఎవరికి వాళ్లు ఎక్కడా తగ్గకుండా నటించారు. వారి నటించారు అనే కంటే.. ఒకరితో ఒకరు పోటీ పడ్డారు అని చెప్పాలి. కానీ, చివర్లో మాత్రం మగజాతి ఆణిముత్యాలు విజయం సాధించారు. గంగవ్వ, అవినాష్, వేణు పాత్రలు ఆడియన్స్ కి గుర్తుండిపోతాయి. ఈ సిరీస్ లో క్రికెట్ తరహాలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గనుక ఇస్తే.. అది కచ్చితంగా ప్రియదర్శికి వెళ్తుంది. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ప్రియదర్శి ఇరగదీశాడు. కూతురు పుష్పవతి అయిన సమయంలో ప్రియదర్శి- కుమార్తె సీన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్ లో ప్రియదర్శి జీవించేశాడు. కన్నీళ్లు తెప్పించేస్తాడు.

ఈ సిరీస్ కి ఆఫ్ ది కెమెరా మహి వి రాఘవ్, అరుణ్ డైరెక్షన్ ఆడియన్స్ ఫుల్ లెంగ్త్ ఎంగేజ్ చేస్తుంది. ఎక్కడా కూడా మీరు ఓ సీన్ లో కూడా బోర్ ఫీలవ్వరు. నవ్వుతూనే ఆలోచిస్తూ ఉంటారు. డైలాగ్స్, సీన్స్ అన్నీ ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి. అజయ్ అరసద సంగీతం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. చిన్నా వాసుదేవరెడ్డి, మహి వీ రాఘవ్ ప్యాషన్ ఈ సిరీస్ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. టేకింగ్, ప్రెజెంటేషన్ ఎంతో రిచ్ గా ఉంటుంది.

బలాలు:

  • కథ
  • లీడ్ రోల్స్ నటన
  • కామెడీ
  • మెసేజ్

చివరిగా: సీజన్ లో కూడా అదే మ్యాజిక్.. అదే ఎంటర్ టైన్మెంట్..

(*ఈ రివ్యూ సమీక్షకుడ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments