కాసులు కురిపించే స్కీమ్.. నెలకు 5000 పొదుపుతో చేతికి 26 లక్షలు

కాసులు కురిపించే స్కీమ్.. నెలకు 5000 పొదుపుతో చేతికి 26 లక్షలు

మీరు మీ డబ్బును అధిక రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా. అయితే సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఆ పథకంలో నెలకు 5000 డిపాజిట్ చేస్తే చేతికి 26 లక్షలు అందుకోవచ్చు.

మీరు మీ డబ్బును అధిక రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా. అయితే సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఆ పథకంలో నెలకు 5000 డిపాజిట్ చేస్తే చేతికి 26 లక్షలు అందుకోవచ్చు.

డబ్బు సంపాదన ఒకెత్తు అయితే సంపాందించిన డబ్బును రెట్టింపు చేయడం ఎలా అని ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టి అధిక రాబడిని పొందాలని చూస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడినిచ్చే పథకాలు ఏంటని ఆరా తీస్తున్నారు. పెట్టిన పెట్టుబడిపై అధిక లాభాలు అందుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వ రంగానికి చెందిన పథకాలు ఏవైనా అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారికోసం పోస్టాఫీస్ అందించే అద్భుతమైన పథకం ఉంది. ఇందులో నెలకు 5000 పొదుపు చేస్తే చాలు చేతికి ఏకంగా 26 లక్షలు అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

పోస్టాఫీస్ ప్రజల కోసం అధిక రాబడినిచ్చే పథకాలను తీసుకొస్తుంది. పోస్టాఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పీపీఎఫ్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కాలానికి కళ్లు చెదిరే రిటర్న్స్ ను అందుకోవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ లో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి రాబడి మారుతూ ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది. లేదంటే స్థిరంగా కూడా ఉంటుంది.

పీపీఎఫ్ స్కీమ్‌లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సంవత్సరానికి కనీసం రూ. 500 అయినా పెట్టుబడి పెడితే స్కీమ్ అకౌంట్ కొనసాగుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ 15 ఏళ్లు. అలాగే ఈ పథకంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ పథకంలో మీరు నెలకు రూ. 5000 డిపాజిట్ చేస్తే.. సంవత్సరానికి 60,000 అవుతుంది. ఇలా 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే, మీ మొత్తం పెట్టుబడి 9 లక్షల రూపాయలు అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడిపై వడ్డీగా రూ.7.27 లక్షలు వస్తుంది. పెట్టుబడి, వడ్డీ సొమ్ము కలుపుకుని మీరు 16.27 లక్షల రూపాయలు పొందుతారు. అయితే మీరు పెట్టుబడి వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే, 20 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. మీకు 14.63 లక్షల వడ్డీ లభిస్తుంది. అంటే మీరు మెచ్యూరిటీ నాటికి 26.63 లక్షలు పొందుతారు. అయితే మీరు 5 సంవత్సరాలు పదవీ కాలాన్ని పొడిగించాలనుకుంటే, మెచ్యూరిటీకి 1 సంవత్సరం ముందుగానే బ్యాంక్, పోస్టాఫీసుకు తెలియజేయాలి.

Show comments