వీడియో: మంత్రంతో చిన్నారి ఏడుపుని ఆపిన తల్లి.. ఇదీ మన సనాతన ధర్మం గొప్పతనం!

వీడియో: మంత్రంతో చిన్నారి ఏడుపుని ఆపిన తల్లి.. ఇదీ మన సనాతన ధర్మం గొప్పతనం!

చిన్నపిల్లలని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారంటే ఇక నాన్ స్టాప్ మ్యూజిక్ వినాల్సిందే. అయితే అంతలా ఏడ్చే పిల్లల్ని ఒకే ఒక్క మంత్రంతో ప్రశాంతంగా ఉండేలా చేయవచ్చునని ఈ తల్లి నిరూపించారు.

చిన్నపిల్లలని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారంటే ఇక నాన్ స్టాప్ మ్యూజిక్ వినాల్సిందే. అయితే అంతలా ఏడ్చే పిల్లల్ని ఒకే ఒక్క మంత్రంతో ప్రశాంతంగా ఉండేలా చేయవచ్చునని ఈ తల్లి నిరూపించారు.

మంత్రాలకు చింతకాయలు రాలతాయా అన్న సామెత ఉంది. చింతకాయలు రాలవేమో గానీ కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయి. ఈ విషయాన్ని మనవాళ్ళు చెప్తే ఎందుకు నమ్ముతారు. తెల్ల కోటు వేసుకుని తెల్లోళ్ళు చెప్తే అబ్బా సాయిరాం అని నమ్ముతారు. ఒకప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసి వర్షాలు పడేలా చేశారని చెబుతారు. భారతీయ సంస్కృతిలో, హిందూ ధర్మంలో వేదాలకు, వేద మంత్రాలకు ఉన్న శక్తి గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతారు. గాయత్రి మంత్రం, భగవద్గీత, శ్లోకాలు వంటివి మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పరిశోధనల్లో తేలింది. మంత్రాల శబ్దానికి మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటారు. ఇక సనాతన ధర్మంలో ఓంకార శబ్దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

సృష్టికి మూలం ఓంకారం అని విశ్వసిస్తారు. ఓంకారంతోనే వేద మంత్రాలు ప్రారంభమవుతాయి. ఓంకార మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది అంటారు. ఓంకార శబ్దం యొక్క శక్తి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. విదేశీయులు సైతం ఈ విషయాన్ని చెబుతారు. వాస్తవానికి భారతీయుల కంటే కూడా విదేశీయులే ఎక్కువగా యోగా చేయడం, భారత సంస్కృతిని అనుసరిస్తుండడం వంటివి చేస్తున్నారు. ఓంకార మంత్రాన్ని వినిపించి విదేశీయులు సైతం తమ చంటి పిల్లల ఏడుపుని ఆపుతున్నారు. పిల్లల ఏడుపు ఆపడానికి ఓంకార మంత్రాన్ని వినిపిస్తామని విదేశీయులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు.

తాజాగా ఓ తల్లి తన బిడ్డ ఏడుపుని ఓంకార శబ్దంతో ఆపిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక తల్లి చంటిబిడ్డను ఎత్తుకుని ఉన్నారు. ఎంత ప్రయత్నించినా బిడ్డ ఏడుపు ఆపడం లేదని.. ఆ తల్లి ఓంకార మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టారు. అంతే అప్పటి వరకూ గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ ఏడుపు ఆపేసి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది. దీన్ని ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం అని కొనియాడుతున్నారు. ఓంకార మంత్రంతో చంటి బిడ్డ ఏడుపు ఆపించిన ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరి ఓంకార నాదంతో ఆ తల్లి చిన్నారి ఏడుపు ఆపడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments