OTT Suggestions- Best Suspense Thriller: ఊరిలో వింత మరణాలు.. వయసొచ్చిన అమ్మాయిలే టార్గెట్.. OTTని ఊపేస్తున్న థ్రిల్లర్!

ఊరిలో వింత మరణాలు.. వయసొచ్చిన అమ్మాయిలే టార్గెట్.. OTTని ఊపేస్తున్న థ్రిల్లర్!

OTT Suggestions- Crazy Crime Thriller: ఓటీటీలో మీరు క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నారా? అయితే ఈ మూవీని మీరు తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అది కూడా తెలుగులో వచ్చిన మూవీ ఇది.

OTT Suggestions- Crazy Crime Thriller: ఓటీటీలో మీరు క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నారా? అయితే ఈ మూవీని మీరు తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అది కూడా తెలుగులో వచ్చిన మూవీ ఇది.

ఓటీటీలోకి చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో ఈ మధ్య ఎక్కువగా రివేంజ్, క్రైమ్, వైలెన్స్ ఉంటోంది. అయితే ఓటీటీ ఆడియన్స్ కూడా అలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారు. అందుకే ఓటీటీలో అలాంటి సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు అలాంటి ఒక సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రావడం మాత్రమే కాకుండా.. ఓటీటీని ఊపేస్తోంది. కాకపోతే ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవడం వల్ల పెద్దగా ఆడియన్స్ కంట్లో పడలేదు. కానీ.. కథ పరంగా, నరేషన్ పరంగా, సీన్స్, ట్విస్టుల పరంగా మాత్రం చూసిన వాళ్లకి గట్టిగానే నచ్చేస్తోంది. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమా పేరు ‘కలియుగం పట్టణంలో’ పేరు కాస్త విచిత్రంగా ఉందని కంగారు పడకండి. ఆ టైటిల్ ని సినిమా కథకు యాప్ట్ అయ్యేలా అలా ప్లాన్ చేశారు. టైటిల్ చూశాక సినిమా కథ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. అవును.. కలియుగంలో ప్రజలు, వారి జీవితాలు, ఆ వింత పోకడలు ఎలా ఉన్నాయి? అనే కోణంలో సాగే కథే ఇది. కాకపోతే ఇది వైలెన్స్, క్రైమ్ నేపథ్యంలో ఉంటుంది. సినిమా కథ మాత్రం కాస్త కొత్తగా ఉంటుంది. సినిమా చూసి నెక్ట్స్ సీన్ ఏంటో చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. అంటే ఊహకు అందినట్లే ఉండి.. అందకుండా కథనం సాగుతుంది.

ఈ మూవీ చూడటానికి ఎంతో వింత కాన్సెప్ట్ అని అర్థమైపోతుంది. ఒక ఊరిలో జరిగే కొన్ని వింత మరణాల గురించి ప్రభుత్వం కూడా కలవర పెడుతూ ఉంటుంది. వయసుకొచ్చిన అమ్మాయిలు అనుమానాస్పదంగా చచ్చిపోతూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. దాని ఛేదించడానికి పోలీసులు కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. నంద్యాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అడవి, వింత మొక్కలు, ఔషధ మూలికలు అంటూ ఏవేవో జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మూకలు ఏంటి? అవి సహజ మరణాలా? ఆత్మహత్యలా? హత్యలా? ఎవరికీ అర్థం కాదు. మరోవైపు హీరోకి ఒక ప్రేమకథ ఉంటుంది. ఆ కష్టం హీరోయిన్ దాకా వస్తుంది.

ఇలాంటి ఒక క్రేజీ మలుపులు, ట్విస్టులతో టాలీవుడ్ లో అయితే ఒక సినిమా ఇంతవరకు రాలేదు. పైగా ఇందులో తల్లీకొడుకు సెంటిమెంట్, కొడుకూ తండ్రి సెంటిమెంట్, ప్రేమ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ని అంతే బాగా చూపించారు కూడా. ఈ కలియుగం పట్టణంలో సినిమాని గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిస్తోంది. ఈ కలియుగం పట్టణంలో సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి క్రేజీ కథలు చూసే అలవాటు ఉంటే మాత్రం మీకు తప్పకుండా నచ్చేస్తుంది.

Show comments