RCB vs RR Kumar Sangakkara On Umpires: అంపైర్​తో సంగక్కర గొడవ! కోపం పట్టలేక ఏం చేశాడంటే..?

RCB vs RR: అంపైర్​తో సంగక్కర గొడవ! కోపం పట్టలేక ఏం చేశాడంటే..?

రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మరోమారు అంపైర్లతో గొడవపడ్డాడు. ఈసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సంగక్కర ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మరోమారు అంపైర్లతో గొడవపడ్డాడు. ఈసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సంగక్కర ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ఎప్పుడూ కామ్​గా, కూల్​గా ఉంటాడు. డగౌట్​లో కూర్చొని టీమ్ గెలుపు కోసం అవసరమైన ప్లాన్స్ వేస్తుంటాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సంగక్కర.. ఈ ఐపీఎల్​లో మాత్రం కాస్త సీరియస్​గా కనిపిస్తున్నాడు. ఈ సీజన్​లో మరోమారు అంపైర్లతో గొడవపడ్డాడు. ఈసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సంగక్కర ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్సీబీ ఇన్నింగ్స్ 14వ ఓవర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్​లో గుడ్ లెంగ్త్ డెలివరీకి షాట్ ఆడదామని అనుకున్నాడు దినేష్ కార్తీక్. కానీ బంతి బ్యాట్​ను మిస్సై ప్యాడ్స్​ను తాకింది. దీంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే డీకే రివ్యూ తీసుకోగా.. థర్డ్ అంపైర్ నాటౌట్​గా ఇచ్చాడు. బాల్ మొదట బ్యాట్​కు తగిలి ఆ తర్వాత ప్యాడ్స్​కు తగిలిందని.. అందుకే నాటౌట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన సంగక్కర.. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. డీకేను అలా ఎలా నాటౌట్ ఇస్తారంటూ ఏకంగా థర్డ్ అంపైర్​ను కలిసేందుకు ప్రయత్నించాడు. ఆ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments