Prabahs Introduced Bujji From Kalki 2898 AD: ప్రభాస్.. బుజ్జిని చూశారా? హాలీవుడ్ కూడా నాగ్ అశ్విన్ ముందు జుజ్జూబీనే!

ప్రభాస్.. బుజ్జిని చూశారా? హాలీవుడ్ కూడా నాగ్ అశ్విన్ ముందు జుజ్జూబీనే!

Prabhas Introduced Bujji From Kalki 2898 AD: ప్రభాస్- నాగ్ అశ్విన్ తీసుకొస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ఇప్పుడు ప్రభాస్ స్వయంగా బుజ్జిని పరిచయం చేయడంతో ఆ బజ్ ఆకాశాన్ని తాకేసింది.

Prabhas Introduced Bujji From Kalki 2898 AD: ప్రభాస్- నాగ్ అశ్విన్ తీసుకొస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ఇప్పుడు ప్రభాస్ స్వయంగా బుజ్జిని పరిచయం చేయడంతో ఆ బజ్ ఆకాశాన్ని తాకేసింది.

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.. చర్చిస్తున్నారు.. ఎదురుచూస్తున్నారు అంటే అది ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ కోసం అనే చెప్పాలి. ఈ పాన్ వరల్డ్ మూవీని జూన్ 27న విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. సాధారణంగానే ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ప్రభాస్ పరిచయం చేసిన బుజ్జి గురించే మాట్లాడుకుంటున్నారు.

సాధారణంగా సినిమా అంటే కొన్ని వస్తువులు, వెహికల్స్ తయారు చేస్తారు. అయితే అవి ఫుల్లీ ఫంక్షనల్ అయ్యి ఉండాలి అని రూల్ ఏం లేదు. చాలా వరకు గ్రాఫిక్స్, మెషిన్స్ తో మ్యానేజ్ చేస్తారు. కానీ, సినిమాలో ఎంతో కీలకంగా ఉండే ఈ బుజ్జిని నాగ్ అశ్విన్ స్వయంగా తయారు చేయించారు. ఏకంగా ఈ కారు తయారీ కోసం రూ.7 కోట్లు ఖర్చు చేశారు అనే వార్తలు వచ్చాయి. అవి విని చాలామంది అంత గొప్పగా ఏం ఉంది అనుకున్నారు. కానీ, బుజ్జిని లైవ్ లో చూసిన తర్వాత మాత్రం వావ్ అనేశారు. ఎందుకంటే ఆ కారు డిజైన్, ఆపరేషన్స్ అంత రేంజ్ లో ఉన్నాయి. అంతేకాకుండా దానిని స్వయంగా ప్రభాస్ తీసుకుని రావడం.. అంత పెద్ద గ్రౌండ్ లో దాంతో చక్కర్లు కొట్టడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మైమరచిపోయారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తరహా ప్రమోషన్స్ అంటే నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ఈ బుజ్జి ఇంట్రడక్షన్ కోసం చిత్ర బృందం చేసిన ఈవెంట్ పాన్ వరల్డ్ లెవల్లో సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. బుజ్జిని తీసుకొచ్చిన తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ మీద నాలుగు సెటైర్లు కూడా వేశాడు. ఈ బక్క పలచని డైరెక్టర్ మూడేళ్లపాటు నన్ను ఈ బుజ్జితో ఇబ్బంది పెట్టాడు అంటూ కామెంట్స్ చేశాడు. మరోవైపు బుజ్జితో వచ్చిన ప్రభాస్ ని చూస్తూ డార్లింగ్ పెద్దమ్మ చిన్న పిల్లలా చప్పట్లు కొట్టడం చూసి అంతా ఫిదా అయిపోయారు.

ఏంటి ఈ బుజ్జి?:

ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ మొత్తం ఫ్యూచరిస్టిక్ అని అందరికీ తెలిసిందే. అంటే ఈ మూవీలో అన్ని విషయాలు అలాగే ఫ్యూచరిస్టిక్ గా ఉండాలి. అందుకే ప్రభాస్ కారు బుజ్జిని ఆ రేంజ్ లో తయారు చేశారు. ఈ బుజ్జిని చూపించిన తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో బుజ్జి టీజర్ ఉంది. ఆ టీజర్ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు నాగ్ అశ్విన్ తెస్తున్న ఈ మూవీపై నమ్మకం వేయి రెట్లు పెరిగింది. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ షాట్స్ చూస్తుంటే హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. బుజ్జి జస్ట్ కారు మాత్రమే కాదు.. ఆ విజువల్స్ చూస్తే ట్రాన్స్ ఫార్మర్స్ సినిమా తరహాలో ఒక రోబోలా కూడా తయారు అవుతుందని అర్థమవుతోంది. అంటే నాగ్ అశ్విన్ చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి.. బుజ్జి మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments